/rtv/media/media_files/2025/02/10/Xw05NkGAncwddlvgequm.jpg)
mastan sai lv Photograph: (mastan sai lv)
Masthan Sai: మస్తాన్ సాయికి రాజేంద్రనగర్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. విచారణలో భాగంగా ఈ నెల 13 నుంచి 15 వరకు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. లావణ్య కేసులో నార్సింగి పోలీసులు మస్తాన్ నుంచి కీలక విషయాలు రాబట్టనున్నారు. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్‌లోని వీడియోలతోపాటు మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీ(Drugs Party)పై పోలీసుల దర్యాప్తు చేపట్టనున్నారు.
Also Read: ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!
మోకిలా పోలీస్ స్టేషన్లలో పలు కేసులు..
అమ్మాయిల ప్రైవేటు వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న కేసులో క్రిమినల్ సాయిని కస్టడీలోకి తీసుకోనున్నారు. అయితే 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు కోరగా 2 రోజులు మాత్రమే కస్టడీకి అనుమతిచ్చింది. ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మస్తాన్ సాయిని ఫిబ్రవరి 13న పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. వీటితోపాటు మస్తాన్‌పై నార్సింగ్, మోకిలా పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?
300 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి..
మరోవైపు క్రిమినల్ మస్తాన్ సాయి కేసులో భయంకరనిజాలు బయటపడుతున్నాయి. సామాన్యులనే కాదు టాలీవుడ్, పాలిటిక్స్ ఫ్యామిలీలను సైతం డిస్ట్రబ్ చేసి తన కంట్రోల్ లోకి తీసుకోవాలని మస్తాన్ సాయి బిగ్ ప్లాన్ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. 300 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడిన మస్తాన్.. సినీ నటులు పూజా హెగ్దే, శృతి హాసన్ తోపాటు ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయవేత్త కూతుళ్లపై కూడా కన్నేశాడు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న తనకు నచ్చిన వారిని లోబరుచుకునేందుకు వశీకరణ చేయాలని ప్రయత్నించాడు. ఈ మేరకు మస్తాన్ తన స్నేహితుడు ఖాజాతో మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి వైరల్ అవుతుండగా అందులో చాలామంది పేర్లను ప్రస్తావించడం సంచలనం రేపుతోంది.
Also Read: రోజ్ డే రోజు లవర్‌ని ఇలా సర్‌ప్రైజ్ చేయండి
ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా వశీకరణ చేసి తాను చెప్పినట్లు వినేలా చేయాలని మస్తాన్ తన ఫ్రెండ్ ఖాజాకు చెప్పాడు. అలాగే మాజీ సీఎం జగన్, అతని ఫ్యామిలీ కూడా తన కాళ్ల దగ్గరకు వచ్చి పడాలన్నాడు. ఏ అమ్మయి అయినా సరే జీవితాంతం తానే కావాలని ఆరాటపడాలని, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడేలా వశీకరణ చేయించమని ఖాజాకు చెప్పాడు. ఇక ఈ వశీకరణ చేయాలంటే ముందుగా తాను ఫొటో పంపించాలని ఖాజా అడగగా.. పెద్ద లిస్టు ఉందన్న మస్తాన్ త్వరలోనే అందరిది పంపిస్తాన్నాడు. అంతేకాదు స్వయంగా పూజా హెగ్దే, శృతిహాసన్, ఏపీ రాజకీయ నేత ఇద్దరు కూతుళ్ల పేర్లను ప్రస్తావించాడు. అందులో ఒకరు మస్తాన్ చూసుకుంటాననగా మరొకరు తనకు కావాలని ఖాజా అన్నాడు. పది రోజుల్లో ఏపీకి వస్తానని, మూహుర్తం ఫిక్స్ చేయాలని ఖాజాకు వివరించాడు మస్తాన్.
Also Read: కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!