/rtv/media/media_files/2025/03/28/gsklGOhvjow1HzZ3GwmC.jpg)
Girl dead Balloon Photograph: (Girl dead Balloon)
ఒక్కరోజు స్కూల్‌కు సెలవు దొరికితే చాలు పిల్లలు ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తల్లిదండ్రులు కూడా వారి పనుల్లో బిజీగా ఉండటంతో వారిని పట్టించుకోరు. పిల్లలు దేనితో ఆడుతున్నారనే విషయాన్ని చూడరు. ఇలా తల్లిదండ్రులు చూడకపోవడంతో ఓ చిన్నారి ఆడుకుంటూ మృతి చెందిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
ఇది కూడా చూడండి: Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!
బెలూన్ పేలి చిన్న ముక్కలు..
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ధులే నగరం యశ్వంత్ నగర్‌లో డింపుల్ అనే 8 ఏళ్ల చిన్నారి ఇంటి దగ్గర ఆడుకుంటుంది. తోటి పిల్లలు బెలూన్లు ఊదడంతో ఆ బాలిక కూడా వాటిని నోటితో ఊదింది. ఈ క్రమంలో బెలూన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆ బాలిక స్పృహతప్పి అక్కడిక్కడే పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా ఆ చిన్నామరి మృతి చెందింది.
ఇది కూడా చూడండి: IPL 2025: SRHకు నిరాశ.. లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ
బెలూన్ పేలిన సమయంలో అందులోని కొన్ని ముక్కలు బాలిక గొంతులోకి వెళ్లాయి. అవి శ్వాసనాళంలో చిక్కుకుపోవడం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. అప్పటి వరకు కళ్ల ముందే ఆడుకుంటున్న చిన్నారి కొన్ని నిమిషాల వ్యవధిలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !
ఇదిలా ఉండగా ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లే కర్కషంగా ఆలోచించి ముగ్గురు పిల్లలకు విషం పెట్టి చంపింది. తర్వాత ఆమె కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం తల్లి రజిత పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను జీరంగూడ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం రాత్రి పిల్లలు తినే అన్నంలో విషం కలపి ఇచ్చింది తల్లి. దీంతో ముగ్గురు చిన్నారులు నిద్రలోనే చనిపోయారు. సాయి క్రిష్ణ (12), మధుప్రియ(10), గౌతమ్ (8) ముగ్గురు చనిపోయారు. కుటుంబ తగాదాలే కారణమా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!
maharastra | latest-telugu-news | Balloon | telugu crime news | today-news-in-telugu | national news in Telugu