/rtv/media/media_files/2025/01/25/PrkWNPNii4FBuphXZiu5.jpg)
Maharashtra husband take nude videos his wife case
Crime: మహారాష్ట్ర ఉల్హాస్‌నగర్‌లో ఓ భయంకరమై దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యకు మత్తుమందు ఇచ్చి అసభ్యకరంగా వీడియో తీసి స్నేహితుడికి పంపాడు. దీంతో వీడియో చూసిన వ్యక్తి సదరు మహిళతో అసభ్యకరంగా మాట్లాడాడు. దీనిపై భార్య అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు భర్త. ఈ ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్తను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతుండగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆహారంలో మత్తు మందు కలిపి..
ఉల్లాస్‌నగర్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి తన భార్యపై అత్యాచారం, వేధింపులు, దాడికి పాల్పడ్డాడు. ఆమె నిద్రిస్తున్నపుడు ఇంట్లోకి మద్యం సేవించి వచ్చి మత్తులో అసభ్యకర వీడియోలు తీశాడు. కొన్నిసార్లు ఆమె తినే ఆహారంలో మత్తు మందు కలిపి సృహతప్పి పడిపోగానే నగ్న వీడియోలు చిత్రీకరించాడు. వాటన్నింటీ తన స్నేహితుడికి పంపించాడు. కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో భర్త స్నేహితుడు ఆ వీడియోలపై కామెంట్స్ చేయడం మొదలుపెట్టాడు. తరచు ఆమెకు ఫోన్ చేయడం, నేరుగా కలిసి అసభ్యకరంగా మాట్లాడుతూ కోరిక తీర్చమని వేధించాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో టార్చర్ తట్టుకోలేక బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!
ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. భర్త, అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిచిన పోలీసులు.. నిందితుడైన భర్తపై భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్