Maharashtra: మహారాష్ట్రలో ఘోరం.. రూ. 500 కోసం సొంత తమ్ముడి హత్య.. అసలేం జరిగిందంటే ?

మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సలీం ఖాన్ అనే వ్యక్తి మద్యం మత్తులో 500 కోసం సొంత తమ్ముడిని హతమార్చాడు. తమ్ముడు తన జేబులో నుంచి అనుమతి లేకుండా డబ్బు తీసుకున్నాడనే కోపంతో వాగ్వాదం పెట్టుకున్నాడు.

New Update
up crime

maharastra crime

Maharashtra Crime :  రూ. 500 కోసం సొంత తమ్ముడిని ప్రాణం తీశాడు ఓ అన్న. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయన అన్న తమ్ముడిపై కిరాతకంగా ప్రవర్తించాడు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర (Maharashtra) లోని థానే జిల్లాలో చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

Also Read: Tripti Dimri: వైట్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాల విధ్వంసం..! చూస్తే ఫిదా - Rtvlive.com

జేబు నుంచి రూ. 500 తీసుకున్నాడని.. 

సలీమ్ ఖాన్ అనే వ్యక్తి  తన  జేబు నుంచి రూ. 500 అనుమతి లేకుండా తీసుకున్నాడని అతని తమ్ముడు నసీం ఖాన్ తో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. దీంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న అన్న సలీమ్ ఖాన్ కోపంలో విచక్షణ కోల్పోయి తమ్ముడిని కత్తితో పొడిచి చంపాడు. వారి తల్లి వాంగ్మూలం ఆధారంగా బుధవారం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు  103(1) సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: Tripti Dimri: వైట్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాల విధ్వంసం..! చూస్తే ఫిదా - Rtvlive.com

ఖమ్మంలో మరో ఘటన 

ఇది ఇలా ఉంటే ఖమ్మం (Khammam) లో మరో ఘటన చోటుచేసుకుంది. నిద్రపోతున్న అన్న పై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పటించాడు. అన్న స్టాలిన్ రోజూ  మద్యం సేవించి తరచూ తనతో గొడవపడుతున్నాడనే కోపంతో  తమ్ముడు  భానుప్రసాద్ పెట్రోల్ పోసి నిప్పటించినట్లు తెలిసింది. మంటలతో ఆర్తనాదాలు పెట్టిన అతడిని గమనించిన మరో సోదరుడు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. తీవ్ర గాయాలతో ఉన్న స్టాలిన్ ని హుటాహుటిన ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడు స్టాలిన్ తమ్ముళ్లను విచారించారు. 

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

Also Read :  ఈరోజు తిరుపతికి వెళ్ళనున్న సీఎం చంద్రబాబు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు