/rtv/media/media_files/2025/04/02/XSbgNqCFXszpggxXqJge.jpg)
wife attack Photograph: (wife attack)
Wife Attack: మధ్యప్రదేశ్‌లో ఓ భయంకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పన్నాలో ఓ భార్య భర్తను చావబాదింది. కొట్టొద్దని వేడుకున్నా వినకుండా పొట్టు పొట్టు కొట్టింది. దండంపెట్టి బాతిమాలిన వినకుండా కాలితో తన్నింది. అయితే బాధితుడు హిడెన్ కెమెరా ద్వారా అతనిపై జరిగిన దాడిని రికార్డ్ చేసి.. ఆమె నుంచి రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా హల్ చల్ చేస్తోండగా వివరాలు ఇలా ఉన్నాయి.
'My wife beats me sir, save me from my wife sir'
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 2, 2025
Lokesh submitted an application to the Superintendent of Police office in Panna, Madhya Pradesh, narrating the story of his own wife's cruelty and requested for help. CCTV footage of his wife beating him came to light. pic.twitter.com/gA7mSOvbP4
లోకేష్ వద్దని వేడుకున్నా..
ఈ మేరకు మార్చి 20న ఈ ఘటన జరిగింది. లోకేష్ అనే వ్యక్తి తన భార్య హర్షిత రైక్వార్ కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఆమె తల్లి, సోదరుడితో కలిసి అతనిపై దాడిచేసింది. ఇంట్లో ఒంటిరిగా ఉన్న అతన్ని పట్టుకుని చితకబాదింది. ఆమె కొడుతుండగా లోకేష్ వద్దని వేడుకున్నారు. దండం పెట్టాడు. కాళ్లు మొక్కిన వినకుండా ఏకధాటిగా గాయపరిచింది. మరో మహిళ ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆమె వినలేదు. ఆమె లోకేష్‌ని ముఖం మీద తన్నింది. అయితే ఈ ఘటన మొత్తం ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో భార్య దారుణం బయటపెట్టాడు. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సత్నా కొత్వాలి పోలీస్ స్టేషన్ సూపరింటెండెంట్‌కు దరఖాస్తు ఇచ్చాడు.
इनका नाम लोकेश है...
— Deepak Sharma (@SonOfBharat7) April 2, 2025
ये रेलवे में ड्राइवर हैं, 1 लाख से अधिक सैलरी
आज इनका वीडियो वायरल हुआ है जिसमें इनकी पत्नी इनको अपनी माँ और भाई के साथ पीट रही है
लोकेश हाथ जोड़ रहा, पैर पड़ रहा, गिड़गिड़ा
रहा लेकिन पत्नी लगातार पीट रही है
ऐसा इसलिए नहीं कि लोकेश कमज़ोर है
बल्कि इसलिए… pic.twitter.com/BtFkA3pIRP
ఇది కూడా చదవండి: Naxalites : మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!
2023 జూన్‌లో హిందూ ఆచారాల ప్రకారం హర్షిత రైక్వార్‌ను వివాహం చేసుకున్నట్లు లోకేష్ వెల్లడించారు. అయితే పెళ్లి అయిన వెంటనే భార్య, అత్తగారు, బావమరిది డబ్బులు, బంగారు-వెండి నగలు కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అతను నిరాకరించడంతో, వారు అతనిని మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారు. ఎలాంటి కట్నం లేకుండా పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, అయినా తనను అత్తమామలు చిత్రహింసలకు గురిచేస్తున్నారని లోకేష్ వాపోయాడు. భార్య హింస నుంచి తనను కాపాడాలని లోకేష్ పోలీసులను వేడుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. 'మానవ హక్కుల కార్యకర్తలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. అతన్ని కాపాడండి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పులు.. వరంగల్ మహిళా మావోయిస్టు మృతి
madyapradesh | husband | telugu-news | today telugu news