సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. 50 మందికి పైగా..

మధ్యప్రదేశ్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

New Update
Cement factory

Cement factory Photograph: (Cement factory )

మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పన్నా జిల్లాలోని జేకే సిమెంట్ ఫ్యాక్టరీ ప్లాంట్‌లో ఓ నిర్మాణం కూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందగా.. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నిర్మాణంలో ఉన్న ప్లాంట్‌లో ఒక విభాగంలో సీలింగ్ స్లాబ్‌ను నిర్మిస్తున్నారు. ఈ సమయంలో స్లాబ్ కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: తస్సాదియ్యా మామూలోడు కాదయ్యా సిరాజ్ : ఆమెతో కాదు.. ఈమెతో డేటింగ్!

ఇది కూడా చూడండి: Maha Kumbh mela: వీవీఐపీల పాస్‌ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!

క్షతగాత్రులను తక్షణమే ఆదుకోవాలని..

ఖజురహో ఎంపీ, రాష్ట్ర బీజేపీ చీఫ్ విష్ణుదత్ శర్మ ఈ ప్రమాదంపై స్పందించారు. క్షతగాత్రులను తక్షణమే ఆదుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారందరికీ కూడా సరైన చికిత్స అందించాలని ఆదేశించారు.

ఇది కూడా చూడండి:  USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి

ఇది కూడా చూడండి: Siddipet Incident: తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కరువుపని.. సిద్దిపేటలో పెను విషాదం!

Advertisment
Advertisment
Advertisment