/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/gng-jpg.webp)
Jharkhand 18 minor boys gang-raped on Three girls
Sexual assault: జార్ఖండ్‌లో మరో హృదయ విదారక ఘటన జరిగింది. ముగ్గురు బాలికలను కిడ్నాప్ చేసి 18 మంది అబ్బాయిలు సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. అయితే ఆ బాలురంతా మైనర్లు కావడం సంచలనంగా మారగా.. ఖుంటి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేయగా వివరాలు ఇలా ఉన్నాయి.
నిందితుల చేతులను పళ్ళతో కొరికి..
ఈ మేరకు ఎస్పీ అమన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో సామూహిక అత్యాచారం హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్థరాత్రి రానియా ప్రాంతంలో ఒక వివాహ వేడుకకు హాజరైన తర్వాత ఐదుగురు బాలికలు ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది అబ్బాయిలు వారిని అనుసరించారు. కొంత దూరంలో నిర్మానుష్య ప్రదేశానికి చేరుకోగానే మొదట ఐదుగురు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి 18 మంది మైనర్ బాలురు బలవంతంగా కొండ మీదకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ సమయంలో ఇద్దరు బాలికలు నిందితుల బారి నుండి తప్పించుకోగలిగారు. నిందితుల చేతులను పళ్ళతో కొరికి పట్టు సడలగానే ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.
ఇది కూడా చదవండి: Elephants: ఏనుగుల దాడిపై పవన్ దిగ్భ్రాంతి.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం!
12-16 సంవత్సరాలే..
అయితే నిందితుల బారి నుంచి తప్పించుకున్న బాలికలు గ్రామానికి వెళ్లి జరిగినదంతా చెప్పారు. గ్రామస్థులు సంఘటన స్థలానికి బాధిత బాలికలను తమతో తీసుకెళ్లి పరిశీంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు బాలికలలో ముగ్గురి వయస్సు 12-16 సంవత్సరాలు కాగా.. నిందితులైన అబ్బాయిల వయస్సు 12-17 సంవత్సరాల మధ్య ఉంది. బాధిత బాలికల ఫిర్యాదు ఆధారంగా నిందితులపై భారత శిక్షాస్మృతి, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అందరినీ అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇక బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి జువైనల్ హోమ్‌కు తరలించారు. బాధితులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: SLBC UPDATES: పెరుగుతున్న బురద నీరు.. ఏ క్షణమైనా కన్వేయర్ బెల్టు తెగే ప్రమాదం!