షటిల్ కోర్ట్‌లోనే కుప్పకూలిన ప్లేయర్ (VIDEO VIRAL)

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో షటిల్ ఆడి కోర్టు పక్కనే కుర్చున్న సుబ్రహ్మణ్యం(53) ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. అతను 20ఏళ్లుగా షటిల్ ఆడుతున్నాడట.

New Update
madnapally shuttel court

madnapally shuttel court Photograph: (madnapally shuttel court)

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఓ వ్యక్తి షటిల్ కోర్టులోనే కుప్పకూలిపోయాడు. షటిల్ ఆడి కోర్టు పక్కనే కుర్చున్న వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోయాడు. సుభాష్ రోడ్డుకు చెందిన సుబ్రహ్మణ్యం(53) ఇండోర్ స్టేడియంలో  షటిల్ ఆడి కూర్చొన్నాడు. బ్రేక్ తీసుకుందామని కూర్చొన్న సుబ్రహ్మణం చూస్తుండగానే కుప్పకూలిపోయాడు.  

ఆయనను స్నేహితులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సుబ్రహ్మణ్యం గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్థారించారు డాక్టర్లు. ఫలితం దక్కకపోవడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. 20 సంవత్సరాలుగా సుబ్రహ్మణ్యం షటిల్ ఆడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మదనపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read:  Virat Kohli: అదే నా వీక్ నెస్‌ అయ్యింది.. కోహ్లీ బయటపెట్టిన భావాలు!

మంగళవారం ఉదయం 8గంటలకు ఈ విషాద ఘటన జరిగింది. షటిల్ కోర్టు లోని సీసీ కెమెరాల్లో సుబ్రహ్మణ్యం కుప్పకూలడం రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 ఇది కూడా చదవండి: AP News: వ్యభిచారం వీడియోలు ఎందుకు బయటపెట్టారు.. పోలీసులపై వైసీపీ నేత ఆగ్రహం!

Advertisment
Advertisment
Advertisment