/rtv/media/media_files/2025/02/23/roJtswfhxbXGmkWkFXbO.jpg)
dilhe man kumbhamela Photograph: (dilhe man kumbhamela)
Kumbh Mela 2025: కట్టుకున్నవాడే ఆమె పాలిట కాల యముడాయ్యాడు. కుంభమేళా వెళ్దామనగానే సంతోషంగా వెంట వెళ్లిన భర్యను భర్త పక్కా ప్లాన్‌తో మర్డర్ చేశాడు. ఢిల్లీలోని త్రిలోక్‌పురికి చెందిన అశోక్ కుమార్ తన భార్య మీనాక్షితో కలిసి కుంభమేళాకు వెళ్లాడు. ఫిబ్రవరి 18న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌కు వారు చేరుకున్నారు. కుంభమేళాలో సాన్నంతోపాటు ఇతర ఫొటోలు, వీడియోలను తన పిల్లలకు అశోక్ కుమార్ పంపాడు. తమ టూర్ సంతోషంగా సాగుతున్నట్లు వారికి చెప్పాడు. కుంభమేళా పుణ్యస్నానాలు అయిపోయాక తిరిగి వచ్చే క్రమంలో యూపీలోని ఓ హోటల్‌తో రాత్రి వారు బస చేశారు. అయితే ఆ రాత్రి అక్కడి బాత్ రూమ్‌లో భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఢిల్లీ చేరుకున్న అతడు కుంభమేళాలో భార్య తప్పిపోయినట్లు తన పిల్లలకు చెప్పాడు.
Also Read : ఇండియాపై ఇంత ప్రేమా.. ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక గురించి తెలిస్తే షాక్!
Sanskari Delhi Man Takes Wife To Maha Kumbh, Slits Her Throat At Hotel To Hide Affair https://t.co/iMIbCpI8OA
— @Ram_Mohd_Singh_Azad (@Arun_Kaku05) February 23, 2025
ఫిబ్రవరి 18న బాత్‌రూమ్‌లో మహిళ మృతదేహాన్ని హోటల్ మేనేజర్ గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏమీ తెలియట్లుగా తన భార్య కనిపించడం లేదంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు అశోక్. వాళ్ల ఇద్దరు పిల్లల్ని కూడా నమ్మించాలని ప్రయత్నించాడు.
Also Read : Bangladesh Trade: దేశ విభజన తర్వాత పాక్‌తో ఫస్ట్ టైం బంగ్లాదేశ్ వ్యాపారం
మీనాక్షి సోదరుడు తన కుమారులతో కలిసి ప్రయాగ్‌రాజ్ చేరుకున్నాడు. సోదరి మృతదేహాన్ని గుర్తించాడు. దీంతో ఆమె భర్త అశోక్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తండ్రి మాటలు నమ్మని పిల్లలు తమ తల్లి కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి ఆమె కోసం వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ తల్లిని తండ్రి హత్య చేసినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. చివరకు నిందితుడైన అశోక్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న అతడు భార్య అడ్డుతొలగించుకునేందుకు కుంభమేళాకు తీసుకువచ్చి హత్య చేశాడని పోలీస్ అధికారి విచారణలో తేలింది.