/rtv/media/media_files/2025/04/03/WriaOOux8YiXKcxAzSXC.jpg)
hansika Photograph: (hansika)
Hansika: గృహ హింస కేసులో భాగంగా ముంబై హైకోర్టును ఆశ్రయించింది నటి హన్సిక. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్.. తనతోపాటు తన తల్లిపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. 2024 డిసెంబర్ 18న అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.
హన్సిక ఫ్యామిలీపై కేసు..
ఈ మేరకు హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ తనను వేధిస్తున్నారంటూ హన్సిక ఫ్యామిలీపై కేసు పెట్టింది. హన్సికా, ఆమె తల్లి మోనా మోత్వానీ తన భర్తతో వివాహం, రిలేషన్‌షిప్ అంశంలో జోక్యం చేసుకుంటున్నారని, తమ మధ్య గొడవలు పుట్టించారని ఆమె ఆరోపించింది. ప్రశాంత్ గృహ హింసకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. వారివల్లే తనకు పక్షవాతం వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. హన్సిక, అత్త ఆస్తి లావాదేవీల్లో మోసం చేస్తున్నట్లు ఆరోపించింది.
My attitude is a reflection of my awesomeness - @ihansika 💫❤️
— Ramesh Bala (@rameshlaus) January 22, 2024
📢@ProRekha pic.twitter.com/fb1o82th5w
ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయగా సెక్షన్ 498A కేసును రద్దు చేయాలంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించింది హన్సిక. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సరంగ్ కోట్వాల్, జస్టిస్ మోడక్‌లతో కూడిన ధర్మాసనం ముస్కాన్ నాన్సీకి నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది.
https://www.youtube.com/watch?v=y8IgX9yxRMY
domestic-voilence | mumbai | high-court | telugu-news | today telugu news