/rtv/media/media_files/2026/03/25/custodial-deaths-2026-03-25-16-03-22.jpg)
దేశంలో గత కొన్నేళ్లుగా తగ్గుతున్నాయని అనుకుంటున్న కస్టడీ మరణాలు(lockup deaths in india) 2026 ప్రారంభంలోనే రికార్డు స్థాయికి చేరాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 15 వరకు, అంటే కేవలం 74 రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 170 కస్టడీ మరణాలు నమోదైనట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంట్ వేదికగా వెల్లడించింది.
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సేకరించిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది లాకప్ డెత్ కేసుల్లో బీహార్ 19 మరణాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 18 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 15 మరణాలు సంభవించాయి. పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రాలో ఒక్కో రాష్ట్రంలో 14 చొప్పున కేసులు నమోదైయ్యాయి.
Also Read : పెట్రోల్ కొరత(NO STOCK) కాదు.. అసలు విషయం తెలిస్తే షాక్!
Custodial Deaths Across Country
#BREAKING: 170 Custodial Deaths Across India in First 74 Days of 2026
— Public News X (@PublicNewsX) March 25, 2026
From Jan 1 – Mar 15, 170 cases reported (police + judicial custody), surpassing last year’s 140.
Data compiled by NHRC from states.
Top states: Bihar (19), Rajasthan (18), UP (15),… pic.twitter.com/NBVJYGbB2W
ఇక తూర్పు భారతదేశంలో ఒడిశా (9), పశ్చిమ బెంగాల్ (7) ఆందోళనకర రీతిలో ఉండగా, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాంలో 5, అరుణాచల్ ప్రదేశ్‌లో 3 కేసులు నమోదయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో 4 కేసులు వెలుగుచూశాయి. అయితే, జమ్ముకశ్మీర్‌లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
దక్షిణాదిలో తమిళనాడు టాప్.. తెలంగాణ పరిస్థితి ఇదే!
దక్షిణ భారతదేశం విషయానికి వస్తే, తమిళనాడు 7 మరణాలతో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో 5 కేసులు నమోదు కాగా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో చెరో 3 కేసులు రికార్డయ్యాయి. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసుల అదుపులో ఉండగానే ప్రాణాలు పోతుండటంపై పౌర సమాజం నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : నేడు కేంద్ర కేబినెట్‌కీలక భేటీ.. చట్టసభల్లో మహిళలకు 33% కోటాపై నిర్ణయం?
గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, కస్టడీ మరణాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
2021-22: 176 మరణాలు
2022-23: 163 మరణాలు
2023-24: 157 మరణాలు
2024-25: 140 మరణాలు
కానీ, 2026లో కేవలం రెండున్నర నెలల్లోనే 170 మరణాలు సంభవించడం షాక్‌కు గురిచేస్తోంది. గత ఏడాది మొత్తం నమోదైన కేసుల సంఖ్యను ఈ ఏడాది తొలి 74 రోజుల్లోనే దాటేయడం భద్రతా వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతోంది.
"కస్టడీలో మరణం అనేది మానవ హక్కుల ఉల్లంఘనలో అత్యంత దారుణమైన రూపం. నిందితులకు రక్షణ కల్పించడంలో వైఫల్యాలను ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి."
ఈ డేటా ఆధారంగా దేశంలో పెరుగుతున్న లాకప్ మరణాల నివారణకు కఠినమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Follow Us