/rtv/media/media_files/2025/03/31/VIeNJTjYOiX9vimVg0M6.jpg)
రంజాన్ సంబరాలు జరుపుకుంటున్న టైంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. వైనర్ బాలుడు కారు నడపడంతో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి కారు దూసుకెళ్లింది. దేశ రాజధాని ఢిల్లీలోని పహర్‌గంజ్‌లో ఈ దుర్ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పిల్లలతో ఇళ్లంతా సందడిగా ఉంది. కానీ కొన్ని గంటల్లోనే ఆ ఆనందం ఆవిరైంది. మైనర్ కారు డ్రైవింగ్ ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది.
Well...
— Jumla Buster (@FekuBuster) March 31, 2025
Pankaj bhai should quickly chant Jai Shri Ram and enter the "Washing Machine".
All his sins will be washed off in a jiffy.https://t.co/acdFXbkdjW
Police have taken the teen's father, Pankaj Agarwal, in custody.
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పహర్‌గంజ్ ఏరియాకు చెందిన ముస్లిం కుటుంబం రంజాన్ సంబురాల్లో ఉంది. వారి రెండేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. వారి పొరుగింటి వ్యక్తి పంకజ్ అగర్వాల్ 15 ఏళ్ల కుమారుడు తండ్రి కారును తీసుకుని బయటికి వెళ్లాడు. పంకజ్ నడుపుతున్న కారు కంట్రోల్ కాక ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Also read: BREAKING: ఒకేరోజు ఇండియా, పాకిస్థాన్‌లో భూకంపాలు
దాంతో అప్పటిదాకా సంబురంగా ఉన్న కుటుంబంలో ఏడుపులు మొదలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు బాలుడి తండ్రి పంకజ్ అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన మైనర్‌లకు వాహనం ఇవ్వకుండా కఠిన చట్టం చేయాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది.
Also read: PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’