/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime-1.jpg)
crime news
బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చేతబడికి ఓ వ్యక్తి బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే గులాబ్ బిఘా గ్రామంలో యుగుల్ యాదవ్ అనే వ్యక్తి ఉంటున్నాడు. మార్చి 13 వ తేదీన అతను కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలైన వివరాలు బయటకు వచ్చాయి.
ఇది కూడా చూడండి: Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!
సంతానం కోసం ఓ వ్యక్తిని..
ధర్మేంద్ర అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి హోలికా దహన్‌లో ఆ వ్యక్తి శరీరాన్ని కాల్చేసినట్లు పోలీసులు గుర్తించారు. సంతానం కోసం సుధీర్ పాశ్వాన్ అనే వ్యక్తి తాంత్రికుడు రామశిఖ్ రాక్యిసన్ దగ్గరకు వెళ్లాడు. దీంతో నరబలి ఇస్తే సంతానం కలుగుతుందని యుగుల్ యాదవ్‌ను దారుణంగా తలను నరికి మొండాన్ని అగ్నిలో కాల్చేశారు. గతంలో కూడా ఇలానే చేసినట్లు పోలీసులు గుర్తించారు. సుధీర్ పాశ్వాన్, ధర్మేంద్ర, మరో ఇద్దరు సహా మొత్తం నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తాంత్రికుడు రామశిక్ రిక్యాసన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!
ఇదిలా ఉండగా ఇటీవల తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. తిరుపతి లోని జీవకోన ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ కుటుంబ సభ్యులను కొంతమంది దుండగులు నిన్న(శుక్రవారం) కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో రూ.కోటి ఇవ్వాలని వారిని బెదిరించారు. అయితే.. కుటుంబ సభ్యుల్లోని ఒకరు చిత్తూరులో ఉన్న తమ బంధువుల దగ్గరికి వెళితే ఇస్తామని చెప్పడంతో వారిని దుండగులు తీసుకెళ్తుండగా ఐతేపల్లి వద్ద కారులో నుంచి రాజేష్ దూకేశాడు.
ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!
అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రాజేష్‌ను స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు రాజేష్‌ను ఆసుపత్రికి తరలించారు.