Betting app: బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో మరిన్ని సంచలనాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ నటులు, యూట్యూబర్లపై కేసులు నమోదవగా తాజాగా ఈ బ్లాక్ దందాలో మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలతో కలిసి తన ఫామ్ హౌస్ వేదికగా బెట్టింగ్ ప్రమోషన్స్‌కు సంబంధించిన డీల్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ లోనే రూ.12 వందల కోట్ల వ్యాపారం..
చైనా నుంచి భారీగా ముడుపులు అందుకున్న మంత్రి ఇల్లీగల్ లావాదేవీలు జరిపినట్లు సమాచారం. కేవలం హైదరాబాద్ లోనే రూ.12 వందల కోట్ల వ్యాపారం జరిగినట్లు ఈడీ భావిస్తోంది. ఈ విషయంపై పొలిటికల్ సర్కిల్ లోనూ చర్చ నడుస్తోందని, పోలీసులకు చిక్కకుండా ఫోన్లు ఆఫ్ చేసి తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ నటులతోపాటు యూట్యూబర్లు 11 మందిపై కేసులు నమోదు చేయగా వీరంతా విచారణకు డుమ్మాకొట్టడంతో మరింత ఉత్కంఠ రేపుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి వారిని కటకటాల్లోకి పంపిస్తున్నారు. నిబంధనలను పక్కన పెట్టి.. యువతను తప్పుదోవ పట్టించి.. తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించొచ్చని బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రెటీలందరిపై పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురి అరెస్టు చేశారు.
రీసెంట్‌గా మరో 11 మందికిపైగా సెలబ్రెటీలపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంత వరకు ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారమంతా పోలీసుల అదుపులో ఉంది. తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ఈడీ (Enforcement Directorate) ఎంటర్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ ఆరా తీసింది.
Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ చెల్లింపుల వ్యవహారంపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే పోలీసులు ఇప్పటి వరకు నమోదు చేసిన కేసు వివరాలను అడిగి తమ వద్దకు తెప్పించుకుంది. దీంతోపాటు ఈడీ పలు విషయాల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. హవాలా రూపంలో చెల్లింపులు, మనీ లాండరింగ్ వంటివి జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.