/rtv/media/media_files/2025/03/14/QkUSPUEvz3JbdhNhR2CV.jpg)
Annamayya dist road Accident Photograph: (Annamayya dist road Accident)
అన్నమయ్య జిల్లా (Annamayya District) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కురబలకోట మండలంలోని కడప క్రాస్ సమీపంలోని తానామిట్ట అడవిపల్లె దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం వేకువజామున బెంగళూరు నుంచి రాజమండ్రికి గ్రానైట్ లోడుతో లారీ వెళ్తోంది. అయితే సత్యసాయి జిల్లా నంబలం పూలకుంటలో సోలార్ పరికరాలు అన్లోడ్ చేసి మంగళూరుకు వెళుతున్న మరో లారీ కూడా వెళ్తోంది.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్!
రెండు లారీలు ఢీకొనడంతో..
ఈ రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ రెండు లారీల్లోని డ్రైవర్లు ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. రెండు లారీలు నుజ్జు నుజ్జు కావడంతో అధికారులు వాటిని జేసీబీ సహాయంతో బయటకు వెలికి తీస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!
ఇదిలా ఉండగా ఇటీవల గుజరాత్ లోని వడోదరలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కారు నడిపి ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. 100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి బైకర్స్ ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !
ఇది కూడా చూడండి: Relation Tips: భయ్యా ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. రోజూ నరకమే