శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ధనపురం క్రాస్ వద్ద హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మహిళలు స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హిందూపురం ఆసుపత్రికి తరలించారు. కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
ముగ్గురు మృతి..
ఇదిలా ఉండగా ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..
ఈ మేరకు కోరుకొండ ఎంపీడీవో ఆఫీస్ వెనక రైస్ మిల్ లోకి శనివారం ఉదయం గోడౌన్ నుండి రైస్ ను ట్రాలిలో రైస్ తీసుకుని వస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో అక్కడికక్కడే మృతులు ఆకుల శ్రీరాములు (34), పలసాని అన్నవరం (55),జాజుల వెంకన్న (46) చనిపోయారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు.
ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి
మృతిపై సమగ్ర విచారణ జరిపి రైస్ మిల్ యజమాన్యంపై, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బలరామకృష్ణ తెలిపారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్టపరిహారాన్ని చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.