/rtv/media/media_files/2025/02/14/HeWYYL4ulI7ozjCsAESP.jpg)
atack on lover
Acid Attack News: ప్రేమికుల దినోత్సవం రోజునే దారుణం జరిగింది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై యాసిడ్ తో దాడి చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా జిల్లాలోని గుర్రంకొండ మండలం ప్యారంపల్లి గ్రామానికి చెందిన జనార్దన్, రెడ్డెమ్మ దంపతుల కుమార్తె గౌతమి (23) పై మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ యాసిడ్ తో దాడి చేశాడు.
Also read : Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్ అంగీకారం!
Also Read : బిగ్ షాక్.. మోదీ ముందే ఇండియాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గౌతమి మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. మదనపల్లె పట్టణంలోని కదిరి రోడ్డులో ఓ బ్యూటీ పార్లర్ షాపును నడుపుతోంది. అయితే గౌతమికి ఇటీవల ఇంట్లో ఓ పెళ్లి సంబంధం చూడగా ఓకే అయింది. ఏప్రిల్ 29న పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్ తో పెళ్లి ఫిక్స్ చేశారు. అయితే గౌతమిని ప్రేమించమంటూ గౌతమ్ వెంటపడేవాడు.
గౌతమి తలపై కత్తితో దాడి
ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయిందని తెలుసుకుని శుక్రవారం ఉదయం యువతి తల్లితండ్రులు పాలు పిండటానికి వెళ్లడం గమనించి ఇంట్లోకి వెళ్లి గౌతమి తలపై కత్తితో దాడి చేశాడు.. ఆ తర్వాత ఆమె మొహంపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌతమి వద్దకు జడ్జి వెళ్లి బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read : ఏం మనుషులు రా మీరు...తమ ముందు బుల్లెట్ బండి నడిపాడని రెండు చేతులు నరికేశారు!