Student Suicide News: తన ఫోటో డీపీగా పెట్టుకున్నాడని విద్యార్థిని సూసైడ్

A student committed suicide : సిద్ధిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని భార్గవి హైదరాబాద్‌లోని జామై ఉస్మానియా సమీపంలో రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. ఒక యువకుడు ఆమె ఫొటోను డీపీగా పెట్టుకోవడం వల్లే సూసైడ్ చేసుకుందని తెలుస్తోంది.

New Update
A student committed suicide

A student committed suicide

Student Suicide News: సిద్ధిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని భార్గవి హైదరాబాద్‌లోని జామై ఉస్మానియా సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ఒక యువకుడి వేధింపులే కారణమని తెలుస్తోంది.సిద్ధిపేట జిల్లా చిన్నికోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి హైదరాబాద్‌లోని ఆంధ్రమహిళా సభలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే చంటి అనే యువకుడు తన ఫొటోను డీపీగా పెట్టుకోవడం వల్లే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Rashmika Mandanna: ఇదే నా లాస్ట్ సినిమా.. రిటైర్మెంట్ పై రష్మిక సంచలన ప్రకటన

అసలేం జరిగిందంటే..?

చంటి అనే యువకుడు భార్గవి ఫొటోను డీపీగా పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి భార్గవి తన ఫొటో ఎందుకు పెట్టుకున్నావంటూ వాట్సాప్‌లో మెసెస్‌ పంపింది. దానికి నువ్వంటే ఇష్టం అంటూ అందుకే పెట్టానంటూ చంటి రిప్లై ఇచ్చాడు. చంటితో చాటింగ్‌ చేసిన భార్గవి ఒకింత ఆవేశంగానే ఆ యువకుడికి వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. పిచ్చిపిచ్చి నాటకాలు చేయకు, నీవల్ల నాకు ఇబ్బంది అవుతుంది. మాఅన్న, అక్కవాళ్లు నీ డీపీ చూశారు.  ఫోటో డిలెట్‌ చేయి చక్కగా, లేదంటే మా అన్నవాళ్లు నిన్ను కొడతారు. నా తప్పు లేకున్నా నన్ను తప్పుగా చూస్తారు. ఏమన్న ఉంటే అన్ని బంధు చేసుకో, తన్నులు తింటా అంటే నీ ఇష్టం ఇగ అంటూ చాట్‌ చేసింది. అయితే ఆ యువకుడు కూడా సారీ చెల్లె ఏదో గలత్‌తో పోటో పెట్టానని, ఇంకోసారి జరగదని, మీ అన్న వాళ్లకు చెప్పకు సారీ అంటూ చాట్‌ చేశాడు. అయితే అదే రాత్రి తన గ్రామానికి చెందిన తన బంధువులు, స్నేహితులు, కొంతమంది గ్రామస్తులకు ఫోన్‌ చేసి తన గురించి ఏమన్న తెలిసిందా అని ఎంక్వరీ చేసినట్లు తెలిసింది. అయితే తన ఫోటో డీపీ పెట్టుకోవడం వల్ల తన గురించి అందరూ చెడుగా అనుకుంటారనే మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పోలీస్ బందోబస్తుతో దళిత వరుడి పెండ్లి ఊరేగింపు

చంటి అనే యువకుడు కొంత కాలంగా భార్గవి వెంటపడుతున్నాడని స్నేహితుల ద్వారా తెలిసిందని, భార్గవి అన్న అని పిలిచినప్పటికీ నువ్వంటే ఇష్టమంటూ వేధిస్తున్నాడని తెలిపారు. భార్గవికి తరచూ ఫోన్‌ చేస్తు్న్నట్లు తెలిపారు. ఒకవేళ భార్గవి కాల్‌ రిసీవ్‌ చేసుకోకపోతే ఆమె స్నేహితులకు కాల్‌ చేస్తూ భార్గవితో మాట్లాడించాలని వేధిస్తున్నాడని తెలిసిందన్నారు. తమ కూతురు మరణానికి కారణమైన యవకున్ని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ

ఇది కూడా చదవండి:  GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు