/rtv/media/media_files/2025/02/15/gJ6asWA2H0s1R6Y3MXlS.jpg)
Prayagraj Road Accident: ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్-మిర్జాపూర్(Prayagraj- Mirjapur) హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) నుంచి మహా కుంభమేళా(Maha Kumbh)కు భక్తులతో వెళ్తున్న బొలెరో ఓ ట్రావెల్ ను బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది భక్తులు స్పాట్ లోనే చనిపోయారు. మరో 19 మందికి గాయాలయ్యాయి. ఫిబ్రవరి 15వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో మేజా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అతి వేగంగా వచ్చిన బొలెరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. మరణించిన భక్తులందరూ బొలెరోలో ప్రయాణిస్తున్నవారే. 19 మంది బస్సులో ఉన్నవారు గాయపడ్డారు.
Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్!
చనిపోయిన వారంతా పురుషులే
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారంతా ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా నివాసితులు. వివరాల ప్రకారం మృతులందరి వయస్సు 25 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, వారందరూ పురుషులేనని తెలుస్తోంది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ఈ సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా 33 రోజుల్లో 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాలో ఇంకా 12 రోజులు మిగిలి ఉన్నాయి.
Also Read : RCB vs GG : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ శుభారంభం
ఏడుగురు ఏపీ వాసులు మృతి
ఇటీవల మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఏపీ వాసులు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా త్రివేణి సంగమంలో స్నానం చేసి మినీ బస్ లో ఇంటికి తిరిగి వస్తుండగా.. మంగళవారం ఉదయం జబల్‌పుర్ జిల్లా పరిధిలోని షిహోరా ప్రాంతంలో మినీ బస్ ను ట్రక్ ఢీకొంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ జిల్లాలోఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరిని మంజు శర్మ (32), మనోజ్ విశ్వకర్మ (42) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
Also Read : Bihar: గురుదక్షిణగా..గర్ల్ ఫ్రెండ్ గా ఉండు...విద్యార్థినికి టీచర్ వేధింపులు
Also Read : వల్లభనేని వంశీ అరెస్ట్..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!