City Buses : మహిళలకు సిటీ బస్ లో ఫ్రీ జర్నీ ఉంటుందా? ఉండదా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ!

సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.

New Update
City Buses : మహిళలకు సిటీ బస్ లో ఫ్రీ జర్నీ ఉంటుందా? ఉండదా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ!

Sajjanar : హైదరాబాద్‌(Hyderabad)లో సిటీ బస్సుల్లో(City Buses) ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువ. మెట్రో ఉన్నా కూడా చాలామంది ఇప్పటికీ సిటీ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. బస్ స్టాప్‌లు ఎక్కువగా ఉండడంతో పాటు బస్సుల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. దీంతో గమ్యస్థానానికి దగ్గరలోనే బస్సు ఆగుతుంది. వెంటనే వెళ్లాల్సిన ప్లేస్‌కు వెళ్లిపోవచ్చు. అందుకే బస్సుల్లో నిత్యం రద్దీ ఉంటుంది. స్కూల్‌, కాలేజీకి వెళ్లే సమయాల్లో లేదా వదిలే సమయాల్లో చాలా మంది వేలాడుతూ కనిపిస్తారు. ఇక తాజాగా తెలంగాణలో కాంగ్రెస్‌(Telangana Congress) అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు నేతలు. గెలిచిన తర్వాత అదే మాట నిలబెట్టుకున్నారు. అయితే సిటీ బస్సుల్లో ఫ్రీ ఉందా లేదా అన్నదానిపై తాజాగా టీఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్‌(Sajjanar) క్లారిటీ ఇచ్చారు.

అందులోనూ ఫ్రీ:
పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. అంటే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. తెలంగాణ రాష్ట్ర నివాసిత మహిళలకే ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. స్థానికత ధ్రూవీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి. కిలోమీటర్ల ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవు. ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేస్తారు. అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుంది.

సజ్జనార్ కీలక ఆదేశాలు:
ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశమున్నందున, బస్ స్టేషన్ల నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను సజ్జనార్ ఆదేశించారు. ఉచిత ప్రయాణం అమలులో ప్రతి సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహారించాలని, ఓపిక, సహనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. రెండేళ్లుగా సిబ్బంది ప్రవర్తనలో మార్పు వచ్చిందని, దాని వల్లే సంస్థ రెవెన్యూ పెరిగిందని గుర్తుచేశారు. అదే స్పూర్తితో ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ టీఎస్ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు.

Also Read: ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత.. ప్రభుత్వ కీలక నిర్ణయం

Advertisment
Advertisment
తాజా కథనాలు