First list: కాంగ్రెస్‌ పార్టీ ఫస్ట్‌ లిస్ట్‌ ఫిక్స్‌.. స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల జాబితా

తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్‌లిస్ట్ రెడీ అయ్యింది. ఈ లిస్ట్‌లో 50 మంది అభ్యర్థులు ఉన్నారని సమాచారం ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ స్ట్రీమింగ్‌ కమిటీకి పంపింది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ సీఈసీకి పంపనుంది. సీఈసీ ఆమోదం అనంతరం సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఈ జాబితాను వెళ్లడించనుంది.

New Update
First list: కాంగ్రెస్‌ పార్టీ ఫస్ట్‌ లిస్ట్‌ ఫిక్స్‌.. స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల జాబితా

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితా 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్‌ లిస్ట్‌లో కీలక నేతలకు చోటిచ్చినట్లు సమాచారం ఇందులో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ప్రధాన్యత కల్పించినట్లు సమాచారం. మొదటి లిస్ట్‌లో ఉన్న వారిలో జూపల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో పాటు వారి వర్గానికి చెందిన పలువురు నేతలుకు టికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరితొ పాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డిలకు అవకాశం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీరియర్‌ నేత మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, అతని సతిమణి పద్మావతిలను సీటు కేటాయించినట్లు సమాచారం. ఉత్తమ్‌ హూజూర్‌ నగర్‌ నుంచి పోటీలో ఉండనుండగా.. గోదాడ నుంచి పద్మావతి రెడ్డి బరిలోకి దిగబోతోంది. ఉత్తమ్‌తోపాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి సైతం ఎమ్మెల్యే సీటు దక్కినట్లు సమాచారం. ఈయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పొటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఫస్ట్‌ లిస్ట్‌ను కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మళ్లీఖార్జన్‌ ఖర్గే ప్రిపేర్‌ చేయగా ఈ లిస్ట్‌ను సోనియా గాంధీ, రాహుల్ గాధీ ఆమోదం తెలిపినట్లు చర్చ జరుగుతోంది. దీంతో అ కాంగ్రెస్ పార్టీ ఈ లిస్ట్‌ను సీఈసీకి పంపబోతోంది. సీఈసీ ఆమోదం తెలిపిన అనంతరం సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ పార్టీ మొదటి లిస్ట్‌ జాబితాను విడుదల చేయనుంది. మరోవైపు ఈ 50 స్థానల్లో ఉన్న వాళ్లు ఎవరనే దానిపై ఉత్కఠం నెలకొంది. సీటును ఆశించి బంగపట్టనేతలను పార్టీ అధిష్టానం ఎలా ఓదార్చుతుంది. అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు