National : మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. ప్రతిపక్షపార్టీలపై మోదీ ప్రభుత్వం వ్యవహారశైలికి నిరసన తెలుపుతూ పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.

New Update
National : మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన

Congress MP's Protest On BJP Government : బీజేపీ (BJP) ప్రభుత్వ తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ (Congress) ఎంపీలు. తమ ప్వార్ధం కోసం.. ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేయడం కోసం ప్రతిపక్ష ఎంపీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ఆపాలని వారు డిమాండ్ చేశారు. అదే అవినీతి చేసిన వారు బీజేపీలో చేరితే.. వారికి అవినీతి చేసుకునేందుకు లైసెన్స్ ఇస్తోందని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేత బట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు హాజరయ్యారు.

మరోవైపు పార్లమెంటులో రాహుల్ (Rahul Gandhi) వ్యాఖ్యలపై ఆయన సోదరి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్పందించారు. హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు చేసారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రియాంక గాంధీ ఖండించారు. తన సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరని, రాహుల్ సైతం ఇదే విషయాన్ని లోక్‌సభలో స్పష్టం చేశారని అన్నారు. కేవలం బీజేపీ, ఆ పార్టీ నాయకుల గురించే రాహుల్ మాట్లాడారని తెలిపారు.

Also Read:Karnakataka: సీఎంను మార్చడంపై సిద్ధిరామయ్య కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు