Stock Market : స్టాక్ మార్కెట్ భారీ పతనం.. బీఎస్‌ఈ, నిఫ్టీలలో భారీ క్షీణత

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలో బుధవారం సూచీలు మొత్తం దిగువకు దిగజారాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్‌ఇ సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతానికి పైగా క్షీణతతో ముగిశాయి.

New Update
Stock Market :  స్టాక్ మార్కెట్ భారీ పతనం.. బీఎస్‌ఈ, నిఫ్టీలలో భారీ  క్షీణత

భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు క్షీణతతో ప్రారంభమయ్యాయి. బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలలో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయి 2.23 శాతం పతనంతో 72000 దిగువకు చేరుకుంది. నిఫ్టీ 2.09 శాతం పతనంతో 21650 వద్ద ముగిసింది. ఇది గడచిన 16 నెలల కాలంలో దారుణమైన క్షీణతగా మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలో బుధవారం సూచీలు మొత్తం దిగువకు దిగజారాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్‌ఇ సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతానికి పైగా క్షీణతతో ముగిశాయి. దీంతో స్టాక్ మార్కెట్ బీఎస్‌ఇలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4.33 లక్షల కోట్లు తగ్గింది.

ఇది కూడా చదవండి :Sirisilla Handloom Workers : సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలి : రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

మార్కెట్ క్షీణత కారణంగా ఈరోజు ఇన్వెస్టర్లు రూ.4 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. మంగళ, బుధవారాల్లో కలిసి మదుపర్లు కోల్పొయిన మొత్తం రూ.5.67 లక్షల కోట్లు . మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా ఏకంగా 2061 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ కూడా 516 పాయింట్లు నష్టపోయింది.

ఇటీవల కాలంలో వరుసగా రికార్డు స్థాయిలో సాక్ట్‌ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ షేర్లలో భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, ఐటీసీ లాభాల్లో ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో భారీ నష్టాలను చవిచూశాయి. వీటితో పాటు యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టాల్లో బాటలోనే కొనసాగాయి. క్యాపిటల్ గూడ్స్, ఐటీ కంపెనీల షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.

Also Read :Mega DSC: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన

సెన్సెక్స్‌లో 30 షేర్లు జాబితా చేయబడ్డాయి. వాటిలో 6 మాత్రమే ఈ రోజు గ్రీన్ జోన్‌లో ముగిశాయి. ఈరోజు హెచ్‌సీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌, ఎల్టీ మైండ్‌ట్రీ, ఎస్బీఐ లైఫ్, టీసీఎస్ లలో అత్యధిక పెరుగుదల నమోదైంది.  బలహీన ఫలితాల తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భారీ పతనం మార్కెట్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అంతకుముందు మంగళవారం సెన్సెక్స్ 199 పాయింట్లు నష్టపోయి 73,128 వద్ద ముగిసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు