Telangana: గర్భిణికి ఆర్టీసీ మహిళా సిబ్బంది కాన్పు.. స్పందించిన సీఎం రేవంత్ కరీంనగర్ బస్‌స్టేషన్‌లో టీజీఆర్టీసీ మహిళా సిబ్బంది ఓ గర్భిణికి కాన్పు చేయండంపై సీఎం రేవంత్ స్పందించారు. కాన్పు చేసి తల్లిబిడ్డను కాపాడిన ఆర్టీసీ మహిళా సిబ్బందికి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్థున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 17 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: కరీంనగర్ బస్‌స్టేషన్‌లో టీజీఆర్టీసీ మహిళా సిబ్బంది ఓ గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వార్తల్లో వచ్చిన వార్తపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. కాన్పు చేసి తల్లిబిడ్డను కాపాడిన ఆర్టీసీ మహిళా సిబ్బందికి అభినందనలు తెలిపారు. సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్థున్నట్లు పేర్కొన్నారు. Also Read: కూరగాయల ధరలకు రెక్కలు..కిలో టమాటా ఎంతో తెలుసా? ఇదిలాఉండగా.. ఓ నిండు గర్భిణి ఊరెళ్దామని కరీంనగర్ (Karimnagar) బస్టాండ్‌కు వచ్చారు. అదే సమయంలో ఆమెకు నొప్పులు వచ్చాయి. దీంతో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది (TGSRTC) చీరలు అడ్డుపెట్టి విజయవంతంగా డెలివరీ చేశారు. 108 వాహనం వచ్చేలోపే.. సాధారణ ప్రసవం చేసి తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆర్టీసీ మహిళా సిబ్బందిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Also Read: గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న #TGSRTC మహిళా సిబ్బందికి నా అభినందనలు. మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. pic.twitter.com/T68rF40q69 — Revanth Reddy (@revanth_anumula) June 17, 2024 #telugu-news #telangana-news #cm-revanth-reddy #pregnant #tgsrtc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి