Telangana: సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం.. ఏంతంటే ?
తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆర్థిక సాయం చేశారు. మొత్తం 135 మందికి రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో 113 మంది పురుషులు ఉండగా.. 22 మంది మహిళలు ఉన్నారు.
తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆర్థిక సాయం చేశారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల్లో సత్తా చాటి.. మెయిన్స్‌కు సిద్ధమవుతున్న 135 మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వాళ్లకు సీఎం రేవంత్ చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో 113 మంది పురుషులు ఉండగా.. 22 మంది మహిళలు ఉన్నారు. వీళ్లలో 21 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు ఉన్నాయి. అలాగే 62 మంది ఓబీసీ, 19 మంది ఎస్సీ, 33 మంది ఎస్టీ కేటగిరీకి చెందినట్లుగా ప్రభుత్వం తెలిపింది.
పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.
ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.
ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.