Bayya Sunny Yadav: బయ్యా సన్నీ యాదవ్ ఎలాంటి వాడంటే.. సంచలన విషయాలు చెప్పిన సూర్యాపేట డీఎస్పీ!
యూట్యూబర్ సన్నీ యాదవ్ కేసుపై సూర్యాపేట డీఎస్పీ రవి స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే అతడిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం సన్నీ యాదవ్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని.. కానీ అతడు పరారీలో ఉన్నాడు అని డీఎస్పీ తెలిపారు.
యూట్యూబర్ (YouTuber) బయ్యా సన్నీ యాదవ్ (Bayya Sunny Yadav) నిన్నటి నుంచి వార్తల్లో నిలుస్తున్నాడు. సోషల్ మీడియా ఖాతాలలో (టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్) ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఫిర్యాదు చేయగా.. సూర్యాపేట కమిషనరేట్‌లోని నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో బయ్యా సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సూర్యాపేట డీఎస్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సన్నీ యాదవ్ అలియాస్ సందీప్‌పై సుమోటోగా కేసు నమోదు చేశాం అని డీఎస్పీ రవి అన్నారు. అతడు సోషల్ మీడియా ఖాతా (Social Media Accounts) లైన ఇన్ స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని అన్నారు. అందువల్లనే అతడిపై నూతన్‌కల్ పీఎస్‌లో ఈ నెల 5న కేసు నమోదు చేశాం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సన్నీ యాదవ్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని పేర్కొన్నారు.
ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం వెతుకుతున్నామని అన్నారు. అలాగే సన్నీ యాదవ్ ఎక్కడ ఉన్నాడో తమకు ఏమీ తెలియదని అతడి పేరెంట్స్ తెలిపారు. దాదాపు 20 రోజుల నుంచి సన్నీ యాదవ్ ఫోన్ కూడా చేయలేదని వారు పేర్కొన్నారు. అయితే అతడు వేరే దేశంలో ఉన్నాడని తెలుసు కానీ.. ఏ దేశంలో ఉన్నాడో తమకు తెలియదు అని చెప్పుకొచ్చారు. దీని బట్టి చూస్తే సన్నీ యాదవ్ త్వరలో అరెస్టు కాబోతున్నాడని అర్థం అవుతోంది.
వి.సి సజ్జనార్ ఫిర్యాదు
బయ్యా సందీప్ అలియాస్ సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాలలో (టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్) ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదుతో సూర్యాపేట కమిషనరేట్‌లోని నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో బయ్యా సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
తన పోస్టుపై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులపై సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు.బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లపై తాను చేసిన 'ఎక్స్' పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీపీ, సూర్యాపేట ఎస్పీకిధన్యవాదాలు తెలిపారు. కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదని అన్నారు. చట్టం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని.. మిలియన్లు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.. డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐటీ చట్టం (2000-2008)లోని 111(2), 318(4), 46, r/w 61(2) BNS, 3, 4 TSGA, 66-C, 66-Dతో సహా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతకు హాని కలిగించడంలో యూట్యూబర్ సన్నీ యాదవ్ ప్రమేయం ఉందని తెలిపారు.
Bayya Sunny Yadav: బయ్యా సన్నీ యాదవ్ ఎలాంటి వాడంటే.. సంచలన విషయాలు చెప్పిన సూర్యాపేట డీఎస్పీ!
యూట్యూబర్ సన్నీ యాదవ్ కేసుపై సూర్యాపేట డీఎస్పీ రవి స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే అతడిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం సన్నీ యాదవ్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని.. కానీ అతడు పరారీలో ఉన్నాడు అని డీఎస్పీ తెలిపారు.
యూట్యూబర్ (YouTuber) బయ్యా సన్నీ యాదవ్ (Bayya Sunny Yadav) నిన్నటి నుంచి వార్తల్లో నిలుస్తున్నాడు. సోషల్ మీడియా ఖాతాలలో (టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్) ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఫిర్యాదు చేయగా.. సూర్యాపేట కమిషనరేట్‌లోని నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో బయ్యా సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సూర్యాపేట డీఎస్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం
సన్నీ యాదవ్ అలియాస్ సందీప్‌పై సుమోటోగా కేసు నమోదు చేశాం అని డీఎస్పీ రవి అన్నారు. అతడు సోషల్ మీడియా ఖాతా (Social Media Accounts) లైన ఇన్ స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని అన్నారు. అందువల్లనే అతడిపై నూతన్‌కల్ పీఎస్‌లో ఈ నెల 5న కేసు నమోదు చేశాం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సన్నీ యాదవ్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని పేర్కొన్నారు.
Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..
ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం వెతుకుతున్నామని అన్నారు. అలాగే సన్నీ యాదవ్ ఎక్కడ ఉన్నాడో తమకు ఏమీ తెలియదని అతడి పేరెంట్స్ తెలిపారు. దాదాపు 20 రోజుల నుంచి సన్నీ యాదవ్ ఫోన్ కూడా చేయలేదని వారు పేర్కొన్నారు. అయితే అతడు వేరే దేశంలో ఉన్నాడని తెలుసు కానీ.. ఏ దేశంలో ఉన్నాడో తమకు తెలియదు అని చెప్పుకొచ్చారు. దీని బట్టి చూస్తే సన్నీ యాదవ్ త్వరలో అరెస్టు కాబోతున్నాడని అర్థం అవుతోంది.
వి.సి సజ్జనార్ ఫిర్యాదు
బయ్యా సందీప్ అలియాస్ సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాలలో (టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్) ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదుతో సూర్యాపేట కమిషనరేట్‌లోని నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో బయ్యా సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్
తన పోస్టుపై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులపై సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లపై తాను చేసిన 'ఎక్స్' పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీపీ, సూర్యాపేట ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. కాసులకు కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలను తీస్తామంటే నడవదని అన్నారు. చట్టం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని.. మిలియన్లు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.. డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు.
Also Read : యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసిన పార్కింగ్ పంచాయతీ.. అసలేమైందంటే?
పలు సెక్షన్లు కింద కేసు