మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. పలు చిత్రాలను లైన్లో పెట్టాడు. అందులో ‘లైలా’ ఒకటి. అయితే ఈ హీరో గతంలో నటించిన ఒక సినిమాకు అరుదైన గౌరవం లభించింది. దీంతో విశ్వక్ సేన్‌తో పాటు, ఆ మూవీ యూనిట్ సైతం సంతోషం వ్యక్తం చేసింది. మరి ఆ మూవీ, లభించిన గౌరవం ఏంటి..? అనే విషయానికొస్తే..
విశ్వక్ సేన్ - చాందిని చౌదరి కలిసి నటించిన చిత్రం ‘గామి’. గతేడాది మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న రిలీజ్ అయింది. అయితే తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్ 2025కు గానూ విశ్వక్ సేన్ “గామి” సినిమా సెలెక్ట్ అయింది. అంతేకాకుండా ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గామి చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనుంది.
Also Read: Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
An incredible milestone for #Gaami ❤️🔥
— UV Creations (@UV_Creations) February 1, 2025
Honored to be an Official Selection at the International Film Festival Rotterdam 2025!✨#GaamiAtIFFR #IFFR2025@VishwakSenActor @iChandiniC @KarthikSabaresh @nanivid @mgabhinaya #NareshKumaran @_Vishwanath9 @Synccinema @vcelluloidsoffl… pic.twitter.com/10Nz7Bl8Lz
కోయ్ కోయ్ సాంగ్
ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ ప్రస్తుతం లైలా మూవీలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విశ్వక్ ఇందులో అబ్బాయిగా మాత్రమే కాకుండా లేడీ గెటప్‌లో కూడా కనిపించనున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
ఇక ఫుల్ బస్ క్రియేట్ అయిన ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయిన సాంగ్ మరింత ఆసక్తిని పెంచేసింది. ఈ మధ్య ‘కోయ్ కోయ్’ అంటూ సాగే ఒక సాంగ్ నెట్టింట వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ సాంగ్‌ను విశ్వక్ సేన్ లైలా సినిమాలో వాడుకున్నారు. సాంగ్ మధ్యలో వచ్చే ఈ లిరిక్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. పెంచల్ దాస్ రచించిన ఈ సాంగ్ ఇప్పుడు ఇస్టెంట్ హిట్ గా మారింది . ఈ పాటని 'గోదారి గట్టు' సింగర్ మధుప్రియ పాడారు.