/rtv/media/media_files/2026/02/20/vijay-rashmika-with-netflix-2026-02-20-19-25-16.jpg)
టాలీవుడ్లో విజయ్, రష్మికల పెళ్లి సందడి నెలకొంది. రాజస్థాన్ ఉదయపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఈ పెళ్లి లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లు ఆఫర్ చేసిందట. ఈ ఆఫర్‌ను ఆ డియర్ కామ్రేడ్ జంట తిరస్కరించింది. విజయ్, రష్మికల పెళ్లి సందడి అభిమానులకు చూపించడానికి రూ.60 కోట్లు ఇస్తామన్నా వారు నో చెప్పారట. ఈ వేడుకకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు, ఫోటోలు లీక్ కాకుండా చూసేందుకు ఓ విదేశీ సెక్యూరిటీ ఏజెన్సీని రంగంలోకి దించుతున్నారట. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సీక్రెట్‌గా ఈ పెళ్లి వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం.
Vijay Deverakonda and Rashmika Mandanna reportedly turned down a staggering ₹60 crore offer from Netflix to stream their wedding. While fans were excited at the possibility of witnessing the grand event, the couple seemingly chose privacy over publicity. pic.twitter.com/cddxMKdlbF
— OneVision Media (@onevision_media) February 20, 2026
రూ. 60 కోట్ల ఆఫర్‌కు నో
సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి వీడియోల స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ సంస్థ విజయ్-రష్మికల పెళ్లి షూటింగ్ హక్కుల కోసం ఏకంగా రూ.60 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, తమ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ, ఈ క్రేజీ డీల్‌ను ఈ జంట సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
రాజస్థాన్‌లో పెళ్లి తర్వాత, టాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వీరి పెళ్లి పత్రిక చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వార్తలపై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Follow Us