Cinema: యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న కింగ్ డమ్ మూవీ టీజర్

గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవర కొండ కాంబినేషన్ లో వస్తున్న విడి12 మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. దీనికి కింగ్ డమ్ అని పేరు పెట్టినట్టు చెబుతూ టీజర్ ను వదిలారు. ఇప్పుడు ఇది యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. 

New Update
movies

Vijaya devarakonda Mew Movie Kingdom

వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. జెర్సీ లాంటి మూవీస్ తీసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ తరువాతి సినిమా రాబోతోంది. దీనికి కింగ్ డమ్ అని పేరు పెట్టారు. ఈరోజు ఈ సినిమా పేరును ప్రకటించడమే కాకుండా టీజర్ ను కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఎన్టీయార్ వాయిస్ ఓవర్ తో  ఉన్న ఈ టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. విజయ్ దేవరకొండ గెటప్ కూడా ఆసక్తిని కలిగిస్తోంది.

సినిమా మీద పెరిగిన అంచనాలు..

ఎన్టీయార్ ఇచ్చిన ఇంట్రడక్షన్ తో కింగ్ డమ్ మూవీ కొత్తగా ఉండనుంది అని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. కింగ్ డమ్ మవీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఈరోజు తెలుగు టీజర్ తో పాటూ తమిళ, హిందీ టీజర్ లు కూడా రిలీజ్ అయ్యాయి. ఇందులో తమిళ్ కు సూర్య, హిందీకి రణబీర్ కపూర్ లు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్  మే 30న బాక్సాఫీస్ ముందు రానుంది. కింగ్ డమ్ టీజర్ యూట్యూబ్ లో అప్పుడే హిట్ కొట్టింది. సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 10 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని దుమ్మురేపుతోంది. ఎన్టీయర్ వాయిస్, విజయ్ యాక్షన్, అనిరుధ్ మ్యూజిక్ అన్నీ అధిరిపోయాయని ఫ్యాన్ అంటున్నారు. సినిమా కోసం ఈ గర్ గా వెయిట్ చేస్తున్నామని చెబుతున్నారు. 

Also Read: USA: ఐదేళ్ళ తర్వాత కలుస్తున్న ట్రంప్, ప్రధాని మోదీ...కీలక అంశాలపై చర్చ! 

Also Read: Cricket: మూడో మ్యాచ్ లోనూ విజయం..ఇంగ్లాండ్ తో వన్డే సీరీస్ క్లీన్ స్వీప్

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు