/rtv/media/media_files/2025/01/19/qyYVBXrEdGrTVZnLg5Ax.jpg)
thaman prabhas
ఎస్. ఎస్ తమన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ, సింగర్‌గా, సింగింగ్ షోలలో జడ్జ్‌గా కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఏదైనా ప్రాజెక్టు మధ్యలో వదిలేసారా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.." ప్రభాస్ చేసిన 'రెబల్' చిత్రం మధ్యలోనే నేను ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాను. ఆ సినిమాకు అడ్వాన్స్ తీసుకున్నాను, పని కూడా ప్రారంభమైంది. ప్రభాస్‌తో అది నా మొదటి ప్రాజెక్ట్ కావడంతో ది బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.." అని తెలిపారు.
Rebel-Cinema.. that was my first film with #Prabhas garu, ..I wanted to give the Best-Music but that went way half through. 🙃 pic.twitter.com/dI4gG36KvU
— . (@charanvicky_) January 18, 2025
Also Read: మనోజ్‌పై మోహన్ బాబు విక్టరీ.. ఇళ్లు ఖాళీ చేయాల్సిందేనని కలెక్టర్ ఆదేశాలు!
అయితే 2012లో వచ్చిన 'రెబల్' సినిమా సమయంలో, దర్శకుడు రాఘవ లారెన్స్ ,తమన్ మధ్య తగాదాలు జరిగాయనే అప్పట్లో వార్తలు వచ్చాయి. తమన్ తప్పుకున్న తర్వాత రాఘవ లారెన్స్ స్వయంగా మ్యూజిక్ అందించారు. 'రెబల్' లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ.. సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది.
'రెబల్' తరువాత తమన్ ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాకు వర్క్ చేశాడు. ఈ మూవీలో పాటలకు మంచి గుర్తింపు దక్కినప్పటికీ, సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. ప్రస్తుతం ప్రభాస్‌తో తమన్ 'రాజాసాబ్' ప్రాజెక్ట్ కు పని చేస్తున్నారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.