వెంకీ మామ బ్లాక్ బస్టర్ పొంగల్‌.. పాటతో అదరగొట్టేశాడుగా..

టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. తాజాగా మూడో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ వేరే లెవల్‌లో పాడారు. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

New Update

టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే సంకాంత్రి కానుకగా 2025 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే రెండు లిరికల్ సాంగ్స్‌ను విడుదల చేసిన మూవీ టీం తాజాగా మూడో పాటను కూడా రిలీజ్ చేసింది.

ఇది కూడా చూడండి: Kadapa: పోలీస్‌ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి

ఇది కూడా చూడండి: Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు

గొబ్బియల్లో అంటూ..

బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ పాడే పాటను వెంకీ మామ పాడటంతో ఈ పాటకు మరింత హైప్ వచ్చింది. రామజోగయ్య శాస్తి లిరిక్స్ సూపర్‌గా రాశారు. సంక్రాంతి, పల్లెటూరు నేపథ్యంలో లిరిక్స్‌తో చించేశారు. ఈ పాటను భీమస్ సిసిరోలియో కంపోజ్ చేయగా.. వెంకటేష్, రోహిణి సోరట్ పాటతో అదరగొట్టేశారు. గొబ్బియల్లో అంటూ సాగే పాటలో మధ్యలో బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ ఎనర్జిటిక్‌గా పాడారు. 

ఇది కూడా చూడండి: జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్‌ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్‌ ఉందా చూసుకోండి మరి!

పాటకు తగ్గట్లుగా విలేజ్ ఫీలింగ్ వచ్చేలా సెటప్ చేశారు. ఇద్దరూ హీరోయిన్లు సంప్రదాయ దుస్తుల్లో డ్యాన్స్‌తో కుమ్మేశారు. మొదట విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఈ మూడో పాట కూడా హిట్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సారి వెంకీ మామ మ్యూజికల్ హిట్ కొట్టేస్తాడని నెటిజన్లు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Buttermilk: మజ్జిగలో కొన్ని కలిపి తాగితే వ్యాధులు మాయం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు