డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. కామెడీ ఎంటర్‌టైనర్‌లో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ సినిమా ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది.
ఇది కూడా చూడండి: Honey trap: టీ కోసం ఇంటికి పిలిచి.. బట్టలిప్పి టెంప్ట్ చేసి: హనీట్రాప్ ముఠా గుట్టురట్టు!
#SankranthikiVasthunam Crossed 200 Crore Mark in 7 Days🔥💥
— PaniPuri (@THEPANIPURI) January 20, 2025
All Set to become the all-time highest-grossing regional film in Telugu cinema.🔥🔥 @VenkyMama @AnilRavipudi pic.twitter.com/heEqG226sa
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు
మొదటి రీజనల్ తెలుగు సినిమాగా..
వారం రోజుల్లో ఈ సినిమా మొత్తం 200 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఏడు రోజులలో 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన రీజనల్ తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మిగతా భాషల్లో కాకుండా కేవలం తెలుగు భాషలో మాత్రమే రిలీజ్ కావడంతో పాటు 200 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన మొట్టమొదటి సినిమాగా రికార్డులు సృష్టించింది.
ఇది కూడా చూడండి: Health: చిన్న బెల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ..కానీ ఏ సమయంలో తినాలో తెలుసా!
గతంలో అలా వైకుంఠపురం సినిమా పేరు మీద ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఈ రికార్డును క్రాస్ చేసింది. కామెడీ జోనర్‌లో ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఇప్పటికీ పలు చోట్ల థియేటర్‌లో ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చూడండి: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు