/rtv/media/media_files/2025/03/20/Zi63xq5OSEmLypSdvbg5.jpg)
Rana Daggubati
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రిటీలపై పోలసులు కేసు నమోదు చేసిన తరుణంలో ఒక్కొక్కరుగా దిగొస్తున్నారు. తాము బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసింది నిజమేనని.. అయితే అఫీషియల్ యాప్‌లనే చేసామని చెబుతున్నారు. ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఇప్పటికే వీటిపై స్పందించారు. తాజాగా మరో హీరో ఈ విషయంపై నోరు విప్పాడు. బెట్టింగ్ యాప్స్‌కు రానా దగ్గుబాటి ప్రమోషన్స్‌పై ఆయన పీఆర్ టీమ్ స్పందించింది.
Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!
ఏం చెప్పిందంటే?
‘‘నైపుణ్యం ఆధారిత గేమ్‌లకు మాత్రమే రానా దగ్గుబాటి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. అదైనా.. గతంలో ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోగా.. అది 2017తోనే ముగిసింది. చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమెదం తెలిపారు. ముఖ్యంగా ఇలాంటి వాటితో ఒప్పందాలు చేసుకునే ముందు రానా లీగల్ టీం ఆ సంస్థకు సంబంధించిన అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా తెలుసుకుని ప్రొసీడ్ అవుతుంది. చట్టపరమైన సమీక్ష తర్వాత.. చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉంటేనే రానా ఆ ప్లాట్‌ఫామ్‌ను అంగీకరించాడు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం...వారిద్దరికీ రెడ్‌కార్నర్ నోటీస్
గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను రానా ఆమోదించడం చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉందని చెప్పడానికే ఈ నోట్ తెలియజేస్తున్నాం. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు ఈ ఆన్‌లైన్ గేమ్‌లను గుర్తించింది. ఈ గేమ్‌లు అవకాశం మీద కాకుండా నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని, అందువల్ల చట్టబద్ధంగా అనుమతించబడతాయని కోర్టు తీర్పు ఇచ్చింది. చట్టబంద్ధంగా లేని ఏ సంస్థకూ రానా ప్రచారకర్తగా లేడు అని అతడి టీమ్ తెలిపింది.