/rtv/media/media_files/2025/03/10/JNdMZsaVwr87td4gYF1F.jpg)
Pil Filed In High Court Against Pushpa Team
పుష్ప టీమ్కు మరో గట్టి షాక్ తగిలింది. హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు ఫైల్ అయింది. లాయర్ నరసింహారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం కింద పుష్ప మూవీ యూనిట్‌పై పిల్ వేశారు.. ఈ మేరకు పుష్ప-2 సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ అందులో పేర్కొన్నారు. పుష్ప-2 సినిమాకు భారీగా లాభాలు వచ్చినట్లు నిర్మాతలే స్వయంగా ప్రకటించారని ఆయన కోర్టుకు వివరించారు.
లాభాల్లో సగం పింఛన్ కోసం ఇవ్వాలి
అయితే ఈ సినిమాకు ఇన్ని కోట్ల లాభాలు రావడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన బెన్ ఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచడం వల్లే ఈ చిత్రానికి ఇన్ని లాభాలు వచ్చాయన్నారు. అందువల్ల సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం.. ఆ లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం మళ్లించాలని కోరారు.
Also read: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్
ఇందులో భాగంగానే తెలంగాణ హోం శాఖ ప్రత్యేక ఉత్తర్వులతో పర్మిషన్ ఇచ్చిందని అన్నారు. అందువల్ల ఆ లాభాల్లో వాటాలను పొందే హక్కు జానపద కళాకారులకు ఉందని లాయర్ నరసింహారావు పేర్కొన్నారు. అయితే ఆయన పిటిషన్‌పై కోర్టు ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: తమలపాకులను నీటిలో మరిగించి తాగితే మీలో ఈ మార్పు గ్యారంటీ
లాభాల విషయం ఎప్పుడో తేలిపోయింది కదా అని లాయర్‌ను అడిగింది. దానికి లాయర్ నరసింహరావు స్పందిస్తూ.. దాని కోసమే ఇప్పుడు పిల్ వేసినట్టు చెప్పారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి కాపీలను పొందుపరచాలని చెప్తూ.. రెండు వారాల వరకు విచారణ వాయిదా వేసింది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: జుట్టు పెరగాలంటే బీట్రూట్ను ఇలా ఉపయోగించండి