/rtv/media/media_files/2024/12/29/9zi8WC2boJcGQrxib6cR.jpg)
Priyanka chopra
Tollywood : రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ #SSMB29. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా క్షణాల్లో వైరలవుతోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ చేరుకోవడం నెట్టింట వైరల్ గా మారింది. హైదరాబద్ ఎయిర్ పోర్ట్ లో ప్రియాంక తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి కనిపించారు. దీంతో మహేశ్- రాజమౌళి #SSMB29 ప్రాజెక్ట్ కోసమే ప్రియాంక హైదరాబాద్ చేరుకున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read : సైఫ్ ను కోటి డిమాండ్ చేసిన దుండగుడు.. వెలుగులోకి సంచలన నిజాలు
Rajamouli - Mahesh Babu Combo SSMB29
BREAKING: Priyanka Chopra lands🛬 in Hyderabad for Mahesh Babu - Rajamouli project SSMB29. pic.twitter.com/6x131pNj7v
— Manobala Vijayabalan (@ManobalaV) January 16, 2025
Also Read : 'జైలర్ 2' గెస్ట్ రోల్స్ లో టాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే?
ఇటీవలే చిత్రబృందం పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. కానీ అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టలేదు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు (Mahesh Babu) ఇదివరకు కనిపించని విధంగా సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు.
Also Read: Life Style: ప్రపంచ చెత్త ఆహారాల జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ ఫుడ్.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం!
Also Read : Breaking: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో డీమార్ట్, రిలయన్స్ ట్రెండ్స్!