Prakash Raj: నేను చేసింది తప్పే.. బెట్టింగ్ యాప్ వివాదంపై ప్రకాష్ రాజ్ సంచలన వీడియో!

బెట్టింగ్ యాప్ వివాదంపై ప్రకాశ్ రాజ్ స్పందించాడు. ‘నేను చేసిన యాడ్ గురించి చర్చ జరుగుతుందని తెలిసింది. నేను యాడ్ చేసిన మాట నిజం. ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నాను. ఇప్పుడు వాటిని ఆపేశాను. ఆ యాడ్‌పై పోలీసులకు వివరణ ఇస్తాను’ అని అన్నాడు.

New Update
Prakash Raj responds to betting app controversy

Prakash Raj responds to betting app controversy

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్ల్ఫుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేస్తున్నారు. రీసెంట్‌గా పంజాగుట్ట పీఎస్‌లో 11 మందిపై, ఇప్పుడు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మరికొందరిపై.. ఇలా దాదాపు 25 మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ప్రకాశ్ రాజ్ పేరు కూడా ఉంది. 

Also read :  హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు

Prakash Raj - betting app

దీంతో ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ వీడియోను విడుదల చేశాడు. ‘‘నేను చేసిన యాడ్ గురించి చర్చ జరుగుతుందని తెలిసింది. అందరినీ ప్రశ్నించే నేను.. ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా!. 2016లో ఆ యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను ఆ యాడ్ చేసిన మాట నిజం. ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నాను. 

Also Read: ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ

2017లో ఒప్పందం పొడిగిస్తామని అడిగారు. కానీ అప్పుడు ఆ యాడ్‌ను ప్రసారం చేయవద్దని కోరాను. 9 ఏళ్ల కిందట ఏడాది ఒప్పందంతో ఆ యాడ్ చేశాను. నేను ఇప్పుడు ఏ గేమింగ్ యాప్ లకు ప్రచారకర్తగా పనిచేయడం లేదు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు.

Also Read: ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!

 నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపాను. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. నేను చేసిన యాడ్ పై పోలీసులకు వివరణ ఇస్తాను. ఈ సందర్భంగా అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. గేమింగ్ యాప్స్ ఒక వ్యసనం లాంటిది. యువత దీనికి చాలా దూరంగా ఉండండి. మీ జీవితాన్ని కోల్పోకండి’’ అని ఆ వీడియో చెప్పుకొచ్చారు. 

Also Read: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hansika: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

గృహ హింస కేసులో భాగంగా ముంబై హైకోర్టును ఆశ్రయించింది నటి హన్సిక. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్.. తనతోపాటు తన తల్లిపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు జూలై 3కు వాయిదా వేసింది.

New Update
hansika

hansika Photograph: (hansika)

Hansika: గృహ హింస కేసులో భాగంగా ముంబై హైకోర్టును ఆశ్రయించింది నటి హన్సిక. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్.. తనతోపాటు తన తల్లిపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 2024 డిసెంబర్ 18న అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 

హన్సిక ఫ్యామిలీపై కేసు..

ఈ మేరకు హన్సిక సోదరుడు ప్రశాంత్‌ మోత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ తనను వేధిస్తున్నారంటూ హన్సిక ఫ్యామిలీపై కేసు పెట్టింది. హన్సికా, ఆమె తల్లి మోనా మోత్వానీ తన భర్తతో వివాహం, రిలేషన్‌షిప్‌ అంశంలో జోక్యం చేసుకుంటున్నారని, తమ మధ్య గొడవలు పుట్టించారని ఆమె ఆరోపించింది. ప్రశాంత్ గృహ హింసకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. వారివల్లే తనకు పక్షవాతం వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. హన్సిక, అత్త ఆస్తి లావాదేవీల్లో మోసం చేస్తున్నట్లు ఆరోపించింది. 

ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయగా సెక్షన్ 498A కేసును రద్దు చేయాలంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించింది హన్సిక. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన జస్టిస్ సరంగ్ కోట్వాల్, జస్టిస్ మోడక్‌లతో కూడిన ధ‌ర్మాస‌నం ముస్కాన్ నాన్సీకి నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది.

 

https://www.youtube.com/watch?v=y8IgX9yxRMY

domestic-voilence | mumbai | high-court | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment