Prabhas Rejected Movies: NTR ‘సింహాద్రి’, మహేశ్ ‘ఒక్కడు’తో పాటు ప్రభాస్ ఇన్ని బ్లాక్ బస్టర్స్ మిస్ చేసుకున్నాడా?.. లిస్ట్ చూశారా?

ప్రభాస్ తన కెరీర్‌లో లెక్కలేనన్ని సినిమాలను రిజక్ట్ చేశాడు. అందులో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సింహాద్రి, ఒక్కడు, దిల్, ఆర్య, బృందావనం, నాయక్, డాన్ శ్రీను, కిక్, ఊసరవెల్లి, జిల్ వంటి చిత్రాలను ప్రభాస్ పలు కారణాల వల్ల మిస్ చేసుకున్నాడు.

New Update
prabhas rejected many tollywood blockbuster movies

prabhas rejected many tollywood blockbuster movies


సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి వద్దనుకొని చేసిన సినిమాలు హీరోలకు విజయాలు అందించి స్టార్‌ని చేస్తాయి. అలాగే ఒకరికోసం రాసుకున్న స్టోరీలు మరొకరి వద్దకు వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయి. ఇప్పటికి అలాంటివి ఎన్నో జరిగాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా వేరే హీరోల వద్దకు వెళ్లి వాళ్లు స్టార్స్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు డేట్స్ లేకపోవడం.. మరికొన్ని సార్లు స్టోరీ నచ్చకపోవడంతో రిజక్ట్ చేసిన సినిమాలు హిట్లుగా నిలిచాయి. అలా ప్రభాస్ కూడా రిజక్ట్ చేసిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read: యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన

ఒక్కడు

‘ఒక్కడు’ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ మారిపోయింది. ఈ చిత్రం అతడికి తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టింది. అయితే దర్శకుడు గుణశేఖర్ ముందుగా ఈ మూవీని  ప్రభాస్‌తో చేయాలనుకున్నాడు. స్టోరీ కూడా వినిపించాడట. కానీ స్క్రిప్ట్ పై డౌట్ వచ్చి ప్రభాస్ ఈ చిత్రానికి నో చెప్పేశాడు. ఆ తర్వాత మహేశ్ బాబు ఈ సినిమా తీసి హిట్టు కొట్టాడు. 

Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!

ఆర్య

దర్శకుడు సుకుమార్‌ మొదటిగా ‘ఆర్య’ కథను ప్రభాస్‌కు వినిపించాడు. కానీ ఈ సినిమా తన ఇమేజ్‌కు సెట్ అవ్వదని వదిలేశాడు. ఆ తర్వాత బన్నీ చేసి హిట్టు కొట్టాడు. 

సింహాద్రి

రాజమౌళి మొదటిగా 'సింహాద్రి' మూవీని బాలయ్యతో చేద్దామనుకున్నాడు. మళ్లీ ఆలోచించి ఆ తర్వాత ఈ కథను ప్రభాస్‌కు వినిపించాడు. ఇలాంటి మాస్ రేంజ్ స్టోరీ తనకు సెట్ అవ్వదనే అనుమానంతో ప్రభాస్ ఈ సినిమాను వదులుకున్నాడు. ఆ తర్వాత దీనిని ఎన్టీఆర్ పూర్తి చేసి హిట్టు కొట్టాడు. 

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

బృందావనం

దర్శకుడు వంశీ పైడిపల్లి ‘మున్నా’తో ప్రభాస్‌కు ఫ్లాప్ ఇచ్చాడు. ఆ తర్వాత ‘బృందావనం’ స్టోరీని ప్రభాస్‌కు వినిపించాడు. కానీ ప్రభాస్ అప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో ఈ స్టోరీతో ఎన్టీఆర్ సినిమా తీసి సక్సెస్ అయ్యాడు.

నాయక్

దర్శకుడు వి.వి వినాయక్‌ మొదటిగా ‘నాయక్’ కథను ప్రభాస్‌కు వినిపించాడు. ఈ మూవీ స్టోరీ నచ్చినా.. అప్పటికే ప్రభాస్ పలు చిత్రాలను కమిట్ అయ్యాడు. మిర్చి, బాహుబలి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఈ చిత్రాన్ని చేయలేకపోయాడు. ఆ తర్వాత రామ్ చరణ్ తీసి హిట్టు కొట్టాడు. 

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

దిల్

‘దిల్’ మూవీ‌ స్టోరీని దర్శకుడు వి.వి. వినాయక్ ముందుగా ప్రభాస్ కు వినిపించాడు. కానీ అప్పటికే ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయలేకపోయాడు. ఆ తర్వాత ఈ సినిమా చేసి నితిన్ సూపర్ హిట్ అందుకున్నాడు. 

డాన్ శీను

గోపీచంద్ మలినేని ఈ స్టోరీని కేవలం ప్రభాస్ కోసమే రాసుకున్నాడు. కానీ అప్పటికే బుజ్జిగాడు సినిమా చేసిన ప్రభాస్.. 'డాన్ శీను' మూవీ స్టోరీ కూడా అదే తరహాలో ఉండటంతో దీనిని వదిలేసుకున్నాడు. ఆ తర్వాత రవితేజ తీసి హిట్ అందుకున్నాడు. 

ఇలా ప్రభాస్ వదులుకున్న కిక్, ఊసరవెల్లి, జిల్ వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇవన్నీ సినిమాలు చేస్తే ప్రభాస్ రేంజ్ ఇంకా మారిపోయేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.

(prabhas | tollywood | latest-telugu-news | movie-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment