నటి పూజా హెగ్డే నటించిన తాజా చిత్రం ‘దేవా’ (Deva). ఇందులో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. ఇవాళ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు హీరో, హీరోయిన్ పలు ప్రమోషన్లలో పాల్గొని సందడి చేశారు. అందులో ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే తీవ్ర నిరాశకు గురైంది.
Also Read :వయసును బట్టి మఖానా ఎంత తినాలి.. నిపుణులు ఏమంటున్నారు?
ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఫైర్ అయింది. తాజా ఇంటర్వ్యూలో ‘బిగ్’ బాలీవుడ్ హీరోలతో పనిచేయడం గురించి, ఈ అవకాశాలను పొందడంలో అదృష్టం పాత్ర పోషించిందా అని పదే పదే ప్రశ్నించడంతో నటి తన సహనాన్ని కోల్పోయినట్లు అనిపించింది.
అదృష్టమా? లేదా అర్హుల
సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ వంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం రావడం కేవలం అదృష్టమా? లేదా మీరు నిజంగా దానికి అర్హులని అనుకుంటున్నారా? అని ఇంటర్వ్యూయర్
మొదట అడిగినపుడు పూజా హెగ్డే (Pooja Hegde) సమాధానం చెప్పింది. ఆ సినిమాల్లో తనను ఎందుకు నటింపజేశారో దానికి ఏదో కారణం ఉండి ఉంటుందని చెప్పుకొచ్చారు.
Also Read: Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
అలాగే మరోసారి దక్షిణాదిలో పనిచేసి, ఆ తర్వాత బాలీవుడ్ (Bollywood) లోకి అడుగుపెట్టిన నటులు పెద్ద నటులతో కలిసి పనిచేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని.. కానీ మీకు అన్నీ పెద్ద పాత్రలు, పెద్ద హీరోలతో చేసే అవకాశం వచ్చింది దీనిపై ఏమంటారు అని ఇంటర్వ్యూయర్ అడిగాడు.
ఇంటర్వ్యూయర్‌పై ఫైర్
దాని ఆమె స్పందిస్తూ.. అవకాశం వచ్చినపుడు తనను తాను దానిని చేయగలిగేలా సిద్ధం చేసుకుంటున్నాను కాబట్టి మీరు దానిని అదృష్టం అని అనుకుంటున్నారు. అలా పిలుచుకున్నా పర్వాలేదు అని అన్నారు. ఇక మూడోసారి కూడా అదే ప్రశ్న వేయడంతో ఆమె తన సహనాన్ని కోల్పోయింది. వెంటనే మీ సమస్య ఏంటి? అని ఇంటర్వ్యూయర్‌పై మండిపడింది. దీంతో పక్కనే ఉన్న షాహిద్ కపూర్ స్పందించి నవ్వుతూ టాపిక్ డైవర్ట్ చేశాడు.