/rtv/media/media_files/2026/04/15/peddi-2026-04-15-19-46-52.jpg)
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులకు బిగ్ షాక్. బుచ్చిబాబు సానా(bucchibabu-sana) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం పెద్ది(peddi) విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించినట్లుగా ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కావడం లేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను జూన్ నెలలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తయింది. కేవలం ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం చాలా సంతృప్తిగా ఉన్నప్పటికీ, సినిమాలోని కంటెంట్‌కు ఉన్న బలాన్ని దృష్టిలో ఉంచుకుని క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్మాతలు భావిస్తున్నారు.
ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ వంటి సాంకేతిక అంశాల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు మరికొంత సమయం పడుతుందని చిత్ర యూనిట్ వివరించింది. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే విడుదల తేదీని జూన్‌కు వాయిదా వేసినట్లు వారు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల పురోగతిని బట్టి జూన్ నెలలో ఖచ్చితమైన తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో శివ రాజ్‌కుమార్, జాన్వీ కపూర్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి భారీ తారాగణం నటిస్తోంది.
Also Read : రిలీజ్‌కు ముందే రికార్డులు సెట్ చేస్తున్న 'స్పిరిట్'.. ఇది మామూలు డీల్ కాదుగా..!
సోషల్ మీడియాను షేక్
ఇక ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన రామ్ చరణ్(Ram Charan) పెహల్వాన్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా చరణ్ చాలా రాగా, పవర్‌ఫుల్ అవతారంలో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ లుక్ చూశాక సినిమాలో చరణ్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమాలోని మొదటి పాట 'చికిరి చికిరి' విడుదలైన క్షణం నుంచే ప్రేక్షకులను ఊపేస్తోంది. రెహమాన్ మార్క్ ఫ్రెష్‌నెస్, ఎనర్జీతో ఉన్న ఈ పాట ఇప్పటికే అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 200 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకోవడం విశేషం. దీని తర్వాత వచ్చిన 'రయ్ రయ్ రా రా' పాట కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ఈ మాస్ ఎనర్జీ సాంగ్ యూట్యూబ్‌లో అప్పుడే 47 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి సినిమాపై ఉన్న హైప్‌ను రెట్టింపు చేసింది.
Also Read : గ్లోబల్ స్టేజ్‌పై "బాహుబలి ఆత్మ" కథ.. రాజమౌళి మరో సంచలనం..!
Follow Us