/rtv/media/media_files/2025/02/17/5pIVb2Fzn0mL4hkMumho.jpg)
Niharika Konidela cameo in Chiranjeevi and Mallidi Vassishta Vishwambhara movie
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక (Niharika) ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓ వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నారు. ఇప్పటికి పలు సిరీస్‌లను నిర్మించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడీ మెగా డాటర్ నిహారిక ఒక కొత్త ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టింది.
Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!
మెగాస్టార్ మూవీలో మెగా డాటర్
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తో కొత్త సినిమాలో నటిస్తోంది. అవును.. మీరు విన్నది నిజమే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నాడు. ఇందులో నిహారిక కూడా సందడి చేయనున్నట్లు తెలిసింది. ఇటీవలే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో అతడు గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలిసింది.
ఇక ఇప్పుడు ఈ సినిమాలో మెగా డాటర్ కాలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలోని ఓ సాంగ్‌లో ఆమె సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ‘విశ్వంభర’లోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌లో నిహారిక చిందేయనున్నట్లు సమాచారం.
#Vishwambhara shooting underway with MEGASTAR'S introduction song being shot under the choreography of @shobimaster ❤️🔥
— Diamond Babu (@idiamondbabu) February 16, 2025
This song will be a treat to watch with MEGASTAR in his element, dancing to the sensational tune by @mmkeeravaani 💥💥
Get ready for MEGA MASS BEYOND UNIVERSE pic.twitter.com/VruwgblGyr
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా
ఇప్పటికే సాంగ్ షూటింగ్ ప్రారంభం కాగా.. శనివారం జరిగిన చిత్రీకరణలో సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నట్లు తెలిసింది. ఇక అదే సాంగ్‌లో నిహారిక కూడా సందడి చేయనున్నారని సమాచారం. అత్యంత గ్రాండ్ లెవెల్లో చిత్రీకరిస్తున్న ఈ సాంగ్‌లో మెగా ఫ్యామిలీ అతిథి పాత్రలు చేస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
విశ్వంభర
చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' (Vishwambara) సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నారు. ఆమెతో పాటు ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా నటిస్తున్నారు. 'నా సామిరంగ' మూవీతో మంచి క్రేజ్ అందుకున్న నటి ఆషికా రంగనాథ్ కూడా ఇందులో హీరోయిన్‌గా కనిపించనున్నారు. అలాగే ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, సురభి కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది.