/rtv/media/media_files/2025/02/07/ph0Wg7jwAE9qMP1rmudz.jpg)
Dada saheb Phalke Photograph: (Dada saheb Phalke)
Dadasaheb Phalke: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఈవెంట్ కూడా నిర్వహిస్తూ, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రభుత్వ కార్యక్రమంగా ముగ్గురు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన అనిల్ మిశ్రాతో పాటు అతని కుమారుడు అభిషేక్, మరో వ్యక్తితో కలిసి మోసానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఇలా ప్రచారం చేయడం ఇదేమి మొదటిసారి కాదు. 2016 నుంచి ఈ ముగ్గురు కూడా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరుతో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చూడండి: అంతా సర్వనాశనం అయిపోయింది..అక్రమవలదారులుగా వచ్చిన భారతీయుల ఆవేదన
An FIR has been registered at Mumbai’s Bandra police station against Anil Mishra, founder and MD of the Dadasaheb Phalke International Film Festival (DPIFF), and his son Abhishek Mishra for an alleged scam involving the festival’s awards.
— Mid Day (@mid_day) February 6, 2025
Despite having a similar name, DPIFF is… pic.twitter.com/dXBt49Qre9
ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్ గ్యాప్ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?
ప్రభుత్వ ఉన్నతాధికారుల ఫొటోలను ఉపయోగించి..
కొన్ని కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పాన్సర్‌షిప్‌లు కూడా తీసుకుంటున్నారు. అలాగే ఈ ఈవెంట్ కోసం కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారుల ఫొటోలను ఉపయోగించి ప్రభుత్వ అధికారిక అవార్డుగా మార్చారు. కొందరు సినీ ప్రముఖులను కూడా ఇందులో పాల్గొనమని బలవంతం చేశారు. దీంతో బీజేపీ ఫిల్మ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ దీక్షిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చూడండి: Delhi BJP : ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరు?... లిస్టులో ఉన్నది వీళ్లే!
ఇది కూడా చూడండి: America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!