/rtv/media/media_files/2025/04/07/hoHo89kZ7dK2jUKncEYO.jpg)
kollywood hero Ajith kumar 285 Feet Cutout Crashes video viral
స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానుల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. థియేటర్ల వద్ద డబ్బులు మేళాలు, టపాసులతో హంగామా చేస్తుంటారు. వారి అభిమానాన్ని ఆ విధంగా చాటుకుంటుంటారు. ముఖ్యంగా తమ అభిమాన హీరో సినిమా షూటింగ్ మొదలైన నుంచి అది రిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేసే వరకు తమదైన శైలిలో సినిమాపై హైప్ పెంచుతారు.
Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
ట్రైలర్ రిలీజ్ అయిందంటే.. వ్యూస్ లెక్కేసుకుంటుంటారు. ఇక సినిమా వచ్చిందంటే థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తుంటారు. రిలీజ్ అనంతరం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్, రికార్డ్స్ విషయంలో తెగ పోటీ పడుతుంటారు. అయితే తాజాగా అలా పోటీ పడి ఓ స్టార్ హీరో అభిమానులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నెక్స్ట్ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని తెలుస్తోంది.
Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
రామ్ చరణ్‌ను బీట్ చేయబోయి
అయితే టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ కటౌట్‌ను బీట్ చేసేందుకే అజిత్ ఫ్యాన్స్ ఇలా చేసినట్లు సమాచారం. ఎందుకంటే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ సమయంలో ఆయన అభిమానులు విజయవాడలో దాదాపు 256 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత భారీ కటౌట్‌గా ఇది రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేయాలనుకుని అజిత్ ఫ్యాన్స్ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్‌కు ముందు అజిత్ అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
🥺🥺🥺🥺🥺💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔#AjithKumar #GoodBadUgly https://t.co/O6l3HsQ62B pic.twitter.com/g1CUwIbevP
— AJITHKUMAR ARMY™ (@AjithKumarArmy) April 6, 2025
Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
నేలకొరిగిన అజిత్ కటౌట్
ఇందులో భాగంగానే తమిళనాడులోని తెంకాశి పట్టణంలో ఉన్న ఒక థియేటర్ వద్ద దాదాపు 285 అడుగుల అత్యంత భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇనుముతో తయారు చేసిన ఫెన్సింగ్ గ్రిల్స్‌తో ఒక్కో భాగాన్ని పెడుతున్నారు. ఇప్పటి వరకు అజిత్ తల నుంచి బాడీ వరకు పెట్టారు. అయితే అది పెట్టిన కొద్ది సేపటికే.. ఆ కటౌట్ కూలిపోయింది. దీనిని గమనించిన జనం అప్రమత్తమై అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అందుక సంబంధించిన వీడియో నెట్టింట వైలర్‌గా మారింది.
Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
(ajith-kumar | Good Bad Ugly | latest-telugu-news | telugu-news | movie-news)