Hot Spot 2 Much: సీక్వెల్ వచ్చేసింది.. ఆహాలో 'హాట్ స్పాట్ 2 మచ్' స్ట్రీమింగ్..

2024లో 'ఆహా' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రం 'హాట్ స్పాట్'. అదే జోష్‌తో ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'హాట్ స్పాట్ 2 మచ్' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

New Update
Train toilet update (18)

Hot Spot 2 Much

2024లో 'ఆహా'(aha) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రం 'హాట్ స్పాట్'. అదే జోష్‌తో ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'హాట్ స్పాట్ 2 మచ్' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు విఘ్నేష్ కార్తిక్ తెరకెక్కించిన ఈ చిత్రం, సమాజంలో మనం చూస్తున్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. వినోదంతో పాటు, నేటి సమాజానికి అవసరమైన ఒక మంచి సందేశాన్ని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం గట్టిగా నమ్ముతోంది.

ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, ఎం.ఎస్. భాస్కర్, తంబి రామయ్య, అశ్విన్ కుమార్, మరియు ఆదిత్య భాస్కర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. మోజ్విత్–మోవిహాన్ సమర్పణలో అనిల్ రెడ్డి ఎం, ముని చంద్రారెడ్డి ఎన్, ఇందుకుమార్ ఎం కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి భాగం సృష్టించిన సంచలనం దృష్ట్యా ఇవాళ ఆహాలో విడుదలైన ఈ సీక్వెల్‌పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం తరహాలోనే ఇది కూడా ఆడియన్స్‌ను మెప్పిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. - tollywood-news-in-telugu

Also Read :  TVK విజయ్ కు బిగ్ షాక్.. విడాకులు కావాలని కోర్టుకెక్కిన భార్య!

Also Read :  యూట్యూబ్ తుక్కు రేగ్గొట్టిన నాని 'ఆయా షేర్'.. ఫుల్ లిరిక్స్ ఇదిగో!

Advertisment
తాజా కథనాలు