/rtv/media/media_files/2025/03/20/rlQbAleDwXUHaxpXLlyQ.jpg)
online betting
బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫిల్మ్‌ఛాంబర్ స్పందించింది. సెలబ్రిటీలు తమ హోదాను కాపాడుకోవాలే తప్ప.. ప్రజలకు నష్టం కలిగే చర్యలను చేపట్టకూడదని తెలిపింది. ఇందులో భాగంగా ఫిల్మ్‌ఛాంబర్, ‘మా’ నుంచి లేఖ రాయాలని నిర్ణయించాం అని పేర్కొంది. ఈ మేరకు యూట్యూబ్‌లో స్టార్స్ అయినంత మాత్రాన రియల్ లైఫ్‌లో స్టార్స్ కాదన్నది గుర్తుంచుకోవాలి అని ఫిల్మ్‌ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Also read : హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు
బెట్టింగ్ యాప్స్ కేసుపై స్పందించిన ఫిల్మ్‌ఛాంబర్.
— greatandhra (@greatandhranews) March 20, 2025
సెలబ్రిటీలు హోదాను కాపాడుకోవాలి.. ప్రజలకు నష్టం కలిగే చర్యలను చేపట్టకూడదు.
ఫిల్మ్‌ఛాంబర్, 'మా' నుంచి లేఖ రాయాలని నిర్ణయించాం
యూట్యూబ్‌లో స్టార్స్ అయినంత మాత్రాన రియల్ లైఫ్‌లో స్టార్స్ కాదన్నది గుర్తుంచుకోవాలి - ఫిల్మ్‌ఛాంబర్… pic.twitter.com/3SWuSaYimw
స్టార్ హీరోలపై కేసులు..
ఇదిలా ఉంటే.. బెట్టింగ్ యాప్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, నిధి అగర్వాల్, మంచులక్ష్మి, అనన్య నాగల్ల, ప్రణీత, శ్రీముఖి, సిరి హనుమంతు, నయని పావనిపై కేసు నమోదు చేశారు. బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు మొత్తం 25 మందిపై కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది.
Also Read: ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ
విష్ణుప్రియ ఫోన్ సీజ్
బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన సెలబ్రెటీలకు తెలంగాణ పోలీసులు చుక్కలు చూయిస్తున్నారు. ఇటీవల యాంకర్ విష్ణుప్రియతో పాటు మొత్తం 11 మంది సెలబ్రెటీలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ ఈ రోజు తన లాయర్ తో కలిసి పంజాగుట్ట పీఎస్ కు విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్‌తో కలిసి ఆమె విచారణకు హాజరయ్యారు.
Also Read: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
ముఖం కనిపించకుండా తలకు స్కార్ఫ్ తో విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియ మొబైల్ ను పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో ఆమె ఏం మాట్లాడారు. వారి మధ్య ఎలాంటి సంప్రదింపులు, లావాదేవీలు జరిగాయి అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. బలమైన ప్రూఫ్స్ ఉండడంతోనే విష్ణు ప్రియ ఫోన్ ను సీజ్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ఏ క్షణమైనా ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తోంది.
Also Read: ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!
బెట్టింగ్ ప్రమోషన్లకు బ్లాక్ మనీ?
బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన వారికి రెమ్యూనరేషన్ ఎలా ఇచ్చారు? అన్న అంశంపై కూడా తీవ్రంగా చర్చ సాగుతోంది. బ్లాక్ మనీ ఇచ్చారా? లేదా క్యాష్ ఇచ్చారా? అన్న కోణంలో విచారణ సాగుతోంది. హవాలా రూపంలో ఏమైనా చెల్లింపులు జరిగాయా? అన్న వివరాలు సైతం పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. లావాదేవీల్లో అవకతవకలు జరిగిన్లు ఏ మాత్రం ఆధారాలు లభించినా.. ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. అప్పుడు కేసు మరింత జఠిలం అయ్యే అవకాశం ఉంది.