Cinema: సీజ్ ద లయన్ అంటున్న రాజమౌళి..ఎస్ఎస్ఎమ్బీ29 షూటింగ్ మొదలైనట్టేనా?

మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా మొదలైంది అంటున్నారు సినీ ప్రియులు. దీనికి నిదర్శనంగా తాజాగా రాజమౌళి పెట్టిన పోస్ట్ ను చూపిస్తున్నారు. సింహాన్ని లాక్ చేస్తూ...తన పాస్ పోర్ట్ ను చూపిస్తూ దర్శక ధీరుడు ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.

New Update
ssmb29

ssmb29

ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఇప్పటి వరకు ఏ సినిమా మొదలెట్టలేదు. ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికే మూడేళ్లు దాటిపోయింది. దీంతో ఆయన మళ్ళీ కొత్త సినిమా మొదలెడతారా అని ఎదురు చూస్తున్నారు. పైగా తన నెక్స్ట్ సినిమా మహేశ బాబు తో చేస్తున్నా అని కూడా అనౌన్స్ చేశారు. అటు మహేశ్ బాబు కూడా రాజమౌళి సినిమా కోసం బాడీని బిల్డప్ చేసుకుంటూ ఇంకే సినిమాలు చేయడం లేదు.  వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ఎస్ఎస్ఎమ్బీ 29 అని వర్కింగ్ టైటిల్ కూడా పెట్టారు. అయితే ఈ మూవీని ఎప్పుడు మొదలెడతారు లేదా మొదలైంది అని గానీ ఎవ్వరూ చెప్పడం లేదు. మూవీ టీమ్ అంతా గప్ చుప్ గా ఉంది. సాధారణంగా రాజమౌళి సినిమా తన సినిమాల గురించి ఎక్కడా ఏ సమాచారం బయటకు రాకుండా చూసుకుంటారు. అయితే కనీసం మొదలుపెట్టామని ఇంతకు ముందు వరకు చెప్పారు. ఇప్పుడు అది కూడా లేదు. దాంతో రాజమౌళి, మహేశ్ బాబులకు సంబంధించి ఏ చిన్న విషయం బయటపడినా ఎస్ఎస్ఎమ్బీ 29 కే సంబంధించినది అనుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు.

ఇంట్రస్టింగ్ గా ఇన్ట్సా పోస్ట్...

తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఇందులో రాజమౌళి, ఆయన వెనుక షింహం ఉన్నాయి.  వీడియోలో సింహాన్ని బోనులో బంధించినట్టు చూపించారు. ఆ వెంటనే తన పాస్ పోర్ట్ ను చూపిస్తూ రాజమౌళి నవ్వుతున్నట్టు ఉంది. ఈ వీడియో చూసిన తెలుగు ప్రేక్షకులు ఇది కచ్చితంగా ఎస్ఎస్ఎమబీ సినిమాకు సంబంధించిన ఇన్ఫోనే అని అంటున్నారు. మహేశ్ తో చేసిన సినిమా అమెజాన్ అడవుల్లో తీస్తారని...కౌ బాయ్ తరహా సినిమా అని ముందు నుంచే చెబుతున్నారు. ఇప్పుడు పోస్ట్ లో సింహాన్ని బంధించినట్టు చూపించడంతో...సినిమా స్టార్ట్ అయిందని రాజమౌళి సంకేతం ఇస్తున్నారని అంటున్నారు. అయితే ఆయన మాత్రం పోస్ట్ లో ఏం చెప్పలేదు. తరువాత పోస్ట్ లేదా ఇంకే విధంగా అయినా చెబుతారేమో అని ఊహిస్తున్నారు. 

 

Also Read: Cricket: నేడే భారత్-ఇంగ్లాండ్  రెండో టీ 20

#today-latest-news-in-telugu #ssmb 29 updates #rajamouli #cinema #mahesh babu
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు