/rtv/media/media_files/2025/04/08/RPsMCAcpKulbWdv6ulP1.jpg)
బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే 8 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో 9వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి మరింత ఎంటర్ టైన్మెంట్, మరింత ఇంట్రెస్టింగ్ గా షోను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read : అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. మీ బతుకు బస్టాండే!
హోస్టుగా బాలయ్య
తాజా నివేదికల ప్రకారం.. నాగార్జున స్థానంలో బాలయ్య బిగ్ బాస్ 9 హోస్టుగా వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్‌స్టాపబుల్‌లో షోతో హోస్టుగా అదరగొట్టిన బాలయ్య.. ఇప్పుడు బిగ్ బాస్ హోస్టింగ్ చేయబోతున్నారనే వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచుతోంది. బిగ్ బాస్ వేదికపై బాలయ్య ఫైర్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ కారణంగా షో నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు సమాచారం. గత 6 సీజన్లు బిగ్ బాస్ హోస్టుగా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు నాగార్జున. శని, ఆదివారాలు రాగానే నాగ్ రివ్యూ కోసం ఎదురుచూస్తుంటారు. అప్పుడప్పుడు కంటెస్టెంట్స్ తో ఫన్, అవసరమైనప్పుడు సీరియస్ నెస్ ప్రదర్శిస్తూ తన హోస్టింగ్ స్టైల్ తో ఆకట్టుకున్నారు.
Also Read : ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి
కంటెస్టెంట్స్ లిస్ట్
ఇదిలా ఉంటే ఇప్పటికే సీజన్ 9 కంటెస్టెంట్స్ కి సంబంధించి పలువురి పేర్లు బయటకు వచ్చాయి. ఫ్రెష్ కంటెస్టెంట్స్ తో పాటు పలువురు మాజీ కంటెస్టెంట్స్ కూడా సీజన్ 9 లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. సీరియల్ ఫేమ్ కావ్య, తేజశ్విని, దేవ్ జానీ, శివకుమార్ తోపాటు రీతూ చౌదరీ, మాజీ కంటెస్టెంట్ సోనియా రాబోతున్నట్లు టాక్.
balayya | bigg boss9 host | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | breaking news in telugu