/rtv/media/media_files/2025/01/05/UI9sz2YVsW0yqsL9R6VE.jpg)
వరుస హిట్లుతో బాలయ్య బాబు దూసుకుపోతున్నాడు. రెండోసారి కూడా హ్యట్రిక్ కొట్టి తనకు తిరుగులేదు అనిపించుకున్నాడు. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా తాజాగా 50 కోట్ల క్లబ్‌లో చేరింది. కేవలం మడు రోజుల్లోనే ఈ రికార్డ్‌ను సృష్టించింది డాకూ మహారాజ్.
మూడు రోజుల్లో 74 కోట్లు..
Sacnilk నివేదిక ప్రకారం.. డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు 25.35 కోట్ల రూపాయలు రాబట్టింది. రెండో రోజు ఈ సినిమా రూ.12.8 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా మూడో రోజు ఇప్పటి వరకు 12 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. దీంతో డాకూ మహరాజ్ మూవీ టోటల్ కలెక్షన్ 50.15 కోట్లకు చేరుకుంది. మరోవైపు ఓవర్సీ లో కూడా ఈ సినిమా కలెక్షన్లను రాబడుతోంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 74 కోట్లు కలెక్ట్ చేసిందని సితార ఎంటర్టైన్‌మెంట్ ప్రకటించింది.
Also Read: Tibet: టిబెట్‌లో ఆగని భూ ప్రకంపనలు..3600 సార్లు..
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై రూపొందిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ చాందిని చౌదరిలు ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. బాలీవుడ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఊర్వశీ రౌతేలా ప్రత్యేక పాటలో డాన్స్ చేసింది. ఇప్పటికే అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య బ్రేక్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతంచేసుకుంటుంది. ఎప్పటిలాగే సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు థియేటర్స్ లో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. బాలయ్య వన్ మ్యాన్ షో అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: Stock Market: లాభాల బాటలో అదానీ షేర్లు...19శాతం పైకి..