/rtv/media/media_files/2025/02/17/0QqlLt3zk2fTBh8VyXJN.jpg)
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) అరుదైన ఘనత సాధించింది. ఇన్‌స్టా (Instagram) లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన సినిమా నటుల జాబితాలో ఆమె రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ హైప్ ఆడిటర్ నివేదిక ప్రకారం హాలీవుడ్ దిగ్గజాలు డ్వేన్ జాన్సన్ , జెన్నిఫర్ లోపెజ్‌లను అధిగమించి, జెండయా తర్వాత స్థానంలో ఆలియా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 85 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో, అలియా భట్ ట్రెండ్ సెట్టర్‌గా కొనసాగుతోంది. గంగూబాయి కతియావాడి, RRR, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ వంటి చిత్రాలలో అలియా భట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
Also Read : ఓర్నీ ఇదెక్కడి అరాచకం.. చిరంజీవితో చిందేయనున్న మెగా హీరోయిన్!
Also Read : Revanth Reddy: కేసీఆర్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్.. ఏం అన్నారంటే!
ప్రభాస్ తో అలియా భట్
సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా పౌజి అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.అయితే ఇందులో అలియా భట్ కూడా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఆమె ఓ యువరాణి పాత్రలో నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఆమె పాత్ర సినిమాకు కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటన చేయనున్నారు. కాగా ఇటీవల ‘జిగ్రా’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆలియా భట్... ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సూపర్ హిట్ అయింది.
Also Read : ఇదిరా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్.. 366 రోజులు ట్రెండింగ్‌లోనే ‘సలార్’
Also read : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..నేడు సెలవు ప్రకటించిన సర్కార్!