/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/revanth-redyy-jpg.webp)
EC Green Signal To Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ (Election Commission) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతులు పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని విషయాలను చర్చించవద్దని తెలిపింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని నిబంధనలు పెట్టింది. అయితే.. రైతు రుణమాఫీ అంశంపై చర్చించడమే ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావించింది. మంత్రివర్గ సమావేశంలో రుణామాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం మంత్రివర్గ సమావేశానికి ఏర్పాట్లు చేసింది.
అయితే.. ఈసీ నుంచి అనుమతి రాకవడంతో ఆఖరి నిమిషంలో మంత్రి వర్గ సమావేశం రద్దు చేయాల్సి వచ్చింది. అయితే.. ప్రస్తుతం మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి ఇచ్చినా.. రుణమాఫీ అంశంపై చర్చకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ప్రభత్వానికి నిరాశ తప్పలేదు. మరోవైపు ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతానని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అనేక సభల్లో స్పష్టం చేశారు. దీంతో ఆ తేదీలోగా రుణమాఫీ చేయడం ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక అంశంగా మారింది. దీంతో రుణమాఫీ చేయడం కోసం రేవంత్ సర్కార్ తీసుకునే నెక్ట్స్ స్టెప్ ఏంటన్న అంశం ఆసక్తికరంగా మారింది.
Also Read: TSPSC పేరు మార్చనున్న రేవంత్ సర్కార్.. కొత్త పేరు ఇదే?
Anugula Rakesh Reddy : ఆ నేరం మళ్లీ మళ్లీ చేస్తా….రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం నోటీసులు జారీ చేసింది. స్పందించిన రాకేష్ రెడ్డి అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్ళీ మళ్ళీ చేస్తానన్నారు.
Anugula Rakesh Reddy
Anugula Rakesh Reddy : టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ(TGPSC) పరువునష్టం దావా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంలో స్పందించిన రాకేష్ రెడ్డి అంతే గాటుగా సమాధానమిచ్చారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..టీజీపీఎస్సీ నోటీసులకు త్వరలోనే సమాధానం ఇస్తానని అన్నారు.
Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!
ఈ సందర్భంగా ఆయన.. అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్ళీ మళ్ళీ చేస్తానని అన్నారు. జైల్లో బంధిస్తే జైలు గోడల మీద నా రాజు తరతరాల బూజు అని ధిక్కార స్వరాన్ని వినిపించిన కవి దాశరథి గారు పుట్టిన ఓరుగల్లు నేల పై పుట్టిన బిడ్డను తనని, ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. గ్రూప్ -1 పరీక్షల్లో జరిగిన అవకతవలకు పై ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని సహేతుకంగా ప్రశ్నించినందుకు నాపై పరువునష్టం దావా వేశారని తెలిపారు. ప్రశ్నిస్తేనే మీ పరువు పోతే మరి, మీవల్ల జరిగిన అవకతవకల వల్ల జీవితాలను కోల్పోతున్న నిరుద్యోగులు ఏం చేయాలి? అని సూటిగా ప్రశ్నించారు. అంతేగాక గతంలో నేడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇదే టీఎస్‌పీఎస్సీ పైన రోడ్డెక్కి ఎన్నో విమర్శలు చేశారని, మరి అప్పుడెందుకు ఇలాంటి నోటీసులు ఇవ్వలేదు..? అని నిలదీశారు.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
బీఆర్ఎస్ పార్టీకి, నాయకత్వానికి కేసులు కొత్తకాదు.. పోరాటం కొత్తకాదు.. ఆ స్ఫూర్తితోనే విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతామని, మీ ఇజ్జత్ దావాకు ఇగురంగానే త్వరలోనే సమాధానం ఇస్తాను అని రాకేష్ రెడ్డి రాసుకొచ్చారు. కాగా ఇటీవల విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఆరోపణలపై సీరియస్ అయిన టీజీపీఎస్సీ రాకేష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. టీజీపీఎస్సీపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని, లేకుంటే పరువు నష్టం, క్రిమినల్ కేసులు దాఖలు చేస్తామని నోటీసుల్లో పేర్కొంది.ఇకపై భవిష్యత్తులో టీజీపీఎస్సీపై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని ఆంక్షలు విధించింది.
Also Read: గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్!
USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు
AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…
Ontimitta Kodandaramundu : వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం
Arjun Son Of Vyjayanthi Trailer: కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
Nainar Nagendran: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్