YEAR ENDER 2024: ఈ ఏడాది మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడైన కార్లు ఏంటంటే?

దేశంలో ఈ ఏడాది కొత్త మోడళ్లతో ఎన్నో కార్లు మార్కెట్‌లోకి వచ్చాయి. కానీ ఇందులో కొన్ని కంపెనీ కార్లు మాత్రమే బాగా అమ్ముడయ్యాయి. ఇందులో మారుతి సుజుకి ఆల్టో టాప్ ప్లేస్‌లో ఉంది. బెస్ట్ ఫీచర్లు ఉండటంతో ఎక్కువ శాతం మంది ఈ కార్లు కొనుగోలు చేశారు.

author-image
By Kusuma
New Update
best selling cars 2024

best selling cars 2024 Photograph: (best selling cars 2024)

ప్రతీ ఏడాది కొత్త మోడళ్లతో కార్లు మార్కెట్‌లోకి వస్తుంటాయి. ప్రస్తుతం ఆటో మొబైల్ రంగానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఇంధనంతో నడిచే కార్లు ఎన్నో కూడా మార్కెట్‌లోకి వచ్చినా.. కొన్ని కంపెనీ కార్లు మాత్రమే ఎక్కువగా అమ్ముడుపోయాయి. అందులో టాప్-5 ఏంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి: అశ్విన్‌ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! 

మారుతి సుజుకి ఆల్టో

ఈ ఏడాది దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మారుతి సుజుకి ఆల్టో టాప్ ప్లేస్‌లో ఉంది. కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ఉన్న ఈ కారు ధర రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. ఇది 24 కిలోమీటర్ల మైలేజిని ఇస్తోంది. దీని ధర తక్కువగా ఉండటంతో పాటు ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం వల్ల ఎక్కువగా ఈ కార్లు అమ్ముడుపోయాయి. 

ఇది కూడా చూడండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే!

మారుతి సుజుకి స్విఫ్ట్

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన ఈ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ధర సుమారుగా రూ.6.5లక్షల నుంచి రూ.8.5 లక్షలు ఉంటుంది. ఇది 22 కిలో మీటర్ల మైలేజిని ఇస్తోంది. ఈ స్విఫ్ట్ కారు స్టైలిష్ లుక్‌లో ఆధునిక ఫీచర్లతో ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. 

హ్యుందాయ్ క్రెటాః

స్టైలిష్ డిజైన్‌లో ఎక్కువ వేరియంట్లు ఉండటంతో హ్యందాయ్ క్రెటా కార్లు అమ్ముడుపోయాయి. దీని ధర సుమారుగా రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉంటుంది. దీని ఫీచర్లు, స్టైలిష్ వల్ల ఈ కారు దేశంలో అమ్ముడుపోయిన కార్లలో మూడో స్థానంలో ఉంది. 

ఇది కూడా చూడండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్

టాటా నెక్సాన్

ఎలక్ట్రిక్ వెర్షన్‌తో పాటు పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో లభించడంతో కస్టమర్లు ఎక్కువగా ఈ టాటా నెక్సాన్‌ కారుపై ఇంట్రెస్ట్ చూపించారు. దీని ధర రూ.8.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లతో ఫీచర్-లోడెడ్ క్యాబిన్ ఉండటంతో పాటు ఎక్కువగా భద్రత రేటింగ్, స్టైలిష్ డిజైన్‌లు ఉండటం వల్ల ఈ కారు అత్యధికంగా అమ్ముడైంది. 

ఇది కూడా చూడండి: AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!

మారుతి సుజుకి బాలెనో

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌తో ఉన్న ఈ కారు సరికొత్త డిజైన్‌తో ఉండటంతో ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఈ కారు ధర రూ.6.5 లక్షల నుంచి రూ.9.5 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు సుమారు 23 నుంచి 24 కిమీ మైలేజ్ ఇస్తోంది. ఇందులో పెద్ద టచ్‌ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Stock Market: నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..

ట్రంప్ టారీఫ్ ల దెబ్బతో కుదేలైపోయిన స్టాక్ మార్కెట్ ఈరోజు కాస్త కోలుకుంది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయం నుంచే లాభాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 1100  పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతున్నాయి.

New Update
stock market

stock market

 స్టాక్ మార్కెట్లో ఇంతలా డైనమిక్ ఛేంజ్ లు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరేమో. నిన్న మార్కెట్లు అధ:పాతాళానికి వెళ్ళి కోట్ల రూపాయలు కరిగిపోయాయి. భారత స్టాక్ మార్కెట్ ఈ ఏడాదిలో రెండవ అతిపెద్ద పతనాన్ని చూసింది. సెన్సెక్స్ 2226 పాయింట్లు (2.95%) పడిపోయి 73,137 వద్ద ముగిసింది. నిఫ్టీ 742 పాయింట్లు (3.24%) పడిపోయి 22,161 వద్ద ముగిసింది. అంతకుముందు జూన్ 4వ తేదీ 2024లో మార్కెట్ 5.74% పడిపోయింది. మరోవైపు ప్రపంచ మార్కెట్ పరిస్థితి కూడా అలానే ఉంది. 

Also Read :  మియాపూర్‌లో లారీ బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి.. మరో ఇద్దరికి సీరియస్!

Also Read :  అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. కాళ్లు, చేతులకు గాయాలు!

ఆసియా మార్కెట్లలో వృద్ధి..

కానీ ఈరోజు ఉదయానికి పరిస్థితి అంతా మారిపోయింది. నష్టాల్లో ఉన్న సూచీలు ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1100 (1.60%) పాయింట్లకు పైగా లాభంతో 74,300 స్థాయిలో ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా దాదాపు 400 (1.70%) పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లోని అన్ని స్టాక్స్ అంటే  30 స్టాక్స్ లాభాల్లో పయనిస్తున్నాయి. ముఖ్యంగా మెటల్, ఆటో షేర్లు బాగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో పెరుగుదల వల్లనే భారతీయ మార్కెట్ లాభాలు చూస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆసియా మార్కెట్లలో.. జపాన్ నిక్కీ ఇండెక్స్ దాదాపు 6% పెరిగింది. అలాగే హాంకాంగ్ ఇండెక్స్ కూడా 2% పెరిగింది. వీటితో పాటూ NSE అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడవుతున్న నిఫ్టీ కూడా 1.5% పెరిగింది. ఇది మార్కెట్లో అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది.  అలాగే నిఫ్టీ 50, సెన్సెక్స్ చార్టులు ఓవర్‌సోల్డ్ RSI స్థాయిలను చూపుతున్నాయి. ఇది షార్ట్-కవరింగ్ , కొత్త కొనుగోళ్లకు దారితీస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Also Read: Bengaluru: బెంగళూరులో లైంగిక వేధింపులు కామన్..హోంమంత్రి పరమేశ్వర వివాదాస్పద కామెంట్స్!

Also Read: Trump Tariffs: ట్రంప్ సుంకాల దెబ్బకు పడిపోయిన చమురు ధరలు..కంగారులో రష్యా

 

nifty | sensex | today-latest-news-in-telugu | Stock Market Today | business news telugu | telugu business news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment